సైకిల్ కి ఉన్న రెండు చక్రాలు వెళ్లిపోయాయి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 15:51:42

సైకిల్ కి ఉన్న రెండు చక్రాలు వెళ్లిపోయాయి

ఢిల్లీని వణికించే చంద్రబాబును ఈ మధ్య కాలంలో గజ గజ వణికిస్తున్నాడు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి..న చంద్రబాబు, లోకేష్ లపైనా పంచులు వేయడంలో సోషల్ మీడియాని మించిపోయారు..చంద్రబాబుకు విజయసాయి రెడ్డి వేసిన పంచ్ యూ-టర్న్ అంకుల్...లోకేష్ కి వేసిన పంచ్ పప్పు నాయుడు... ఇప్పుడు ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి...ఇలా తండ్రి కొడుకులపై పంచ్ ల మీద పంచ్ లు విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు...
 
మన పప్పు నాయుడు అన్యాయం, అక్రమం, అవినీతి అనే మూడు పోర్ట్ పోలియోలుతో ముందుకు వెళ్తున్నారు. పప్పు నాయుడు చేస్తున్న అవినీతిని చూసి NT రామారావు గారి ఆత్మ ఘోషిస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు..ముందు మీ మీద వస్తున్నా ఆరోపణలకు సమాధానం చెప్పండి పప్పనాయుడు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు...
 
తెలుగుదేశం పార్టీ సైకిల్ ని గతంలో రెండు చక్రాల మీద నడిపేవాడు. ఒక చక్రం బీజేపీ అయితే ఇంకో చక్రం జనసేన మీద నడిపేవాడు...అయితే ఇప్పుడు ముందు చక్రం వెళ్ళిపోయింది...వెనక చక్రం వెళ్ళిపోయింది... అంతకు ముందు కమ్యూనిస్టులు ఒక సైడ్...మిగతా రాజకీయ పార్టీలన్నీ ఒక సైడ్ ఈ రకంగా రెండు చక్రాలు ఉన్నాయి...ఆ రెండు చక్రాలు కూడా వెళ్లిపోయాయి...ఇప్పుడు చక్రాలు లేని సైకిల్ తయారయింది అందుకే చక్రాలు కోసం వెతుకుంటున్నాడు ...ఎవరు దొరుకుతారా ఎప్పుడు చక్రం బిగించుకుందామా అని... ఇది సైకిల్ పరిస్థితి అన్నారు విజయసాయి రెడ్డి...
 
కానీ ఇప్పుడు ఎవరు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు...ఏ రాజకీయ పార్టీ కూడా బలపరిచే పరిస్థితి లేదు...ఈరోజు ఏకాకిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తనకు క్రెడిబిలిటీ లేదు, ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు...తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితిలోను  అధికారంలోకి రాదు...వైసీపీ అధికారంలోకి వస్తుంది... జగన్ ముఖ్యమంత్రి అవుతారు...
 
ఫ్యాన్ బాగా తిరుగుతు, మరింత జోరుగా ముందుకు వెళ్తుంది...అన్ని పార్లమెంట్ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది...175 స్థానాల్లో మినిమం 150 స్థానాలు గెలుచుకుంటుంది అనే విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాం...ప్రజలందరి మద్దతు మా వైపు ఉంది...కచ్చితంగా విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేసారు విజయసాయి రెడ్డి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.