ఆ హామీ క‌చ్చితంగా నెర‌వేరుస్తారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 15:06:40

ఆ హామీ క‌చ్చితంగా నెర‌వేరుస్తారు

విశాఖ‌లో పాద‌యాత్ర‌లో ఉన్న విజ‌య‌సాయిరెడ్డి గాజువాక‌ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు..గాజువాక ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇక్క‌డ సమస్యలు అలానే వెంటాడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా గాజువాక హౌజింగ్‌ కమిటీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు.
 
చంద్ర‌బాబు ప్ర‌త్యేక హూదా అంశంలోనే కాదు రాష్ట్ర అభివృద్దిలో కూడా యూట‌ర్న్ తీసుకుంటున్నార‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.. విశాఖ‌కు ఐటీ కంపెనీలు వ‌స్తాయి అన్నారు, ఎటువంటి కంపెనీలు ఇక్క‌డ‌కు రాలేద‌ని ఉత్త‌రాంధ్రా మూడు జిల్లాల‌కు విశాఖ ఓ ఐకాన్ లాంటిది అని, ఇక్క‌డ అభివృద్ది ఈ నాలుగేళ్ల‌లో న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది అని విమ‌ర్శించారు.
 
అలాగే ఉక్కు నిర్వాసితులకు చంద్రబాబు మొండిచేయి చూపించారని అన్నారు. ఆర్‌ కార్డు హోల్డర్లకు వయోపరిమితి దాటిపోయిందని అన్నారు. వారికి రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసినా.. ఈరోజుకి చెల్లించలేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ భూముల్లో స్పోర్ట్స్‌ హబ్‌ కడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేద‌ని ఆయ‌న గుర్తుచేశారు..జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఆ హామీ త‌ప్ప‌క నెర‌వేరుస్తారు అని విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి అక్క‌డ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేస్తూ హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.