విజ‌య‌సాయిరెడ్డి పార్టీ నాయ‌కుల‌తో కీల‌క భేటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-10-09 11:45:41

విజ‌య‌సాయిరెడ్డి పార్టీ నాయ‌కుల‌తో కీల‌క భేటీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల ఆఖ‌రిలోగా శ్రీకాకుళం జిల్లాలోకి ప్ర‌వేశించ‌నుంద‌ని ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు జిల్లాలోని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, జ‌గ‌న్ శ్రీకాకుళం జిల్లాలోకి ప్ర‌వేశించ‌గానే జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్ లే బాధ్య‌త తీసుకోవాల‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో అన్ని క్యాడ‌ర్లను బ‌లోపేతం చేసేందుకు క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌తీ రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌పున ఏదో ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి పార్టీని మ‌రింత బ‌లోపేతం చెయ్య‌లాని విజ‌య‌సాయిరెడ్డి సూచించారు. అంతేకాదు జిల్లాలోని ప్ర‌జ‌లు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారో ఆ స‌మ‌స్య‌ల‌న్నింటిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. 
 
అలాగే వైసీపీ అనుబంధ‌ సంఘాలు 22 ఉన్నాయ‌ని ఇందులో ఉన్న‌ స‌భ్యులంతా వైసీపీని బ‌లోపేతం చేసేందుకు కృషి చెయ్యాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఇందుకు కావాల్సిన ఫ‌ర్నీచ‌ర్ కంప్యూట‌ర్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈకాల్ సెంట‌ర్ల‌ను నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయ‌నున్నామ‌ని అన్నారు. కాల్ సెంట‌ర్లు స‌క్ర‌మంగ నిర్వ‌హించే బాధ్య‌త ఆయా నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌యక‌ర్త‌లే చూసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. క‌ళాశాల‌కు, జ‌న స‌మూహాల్లో న‌వ‌ర‌త్నాల పోస్ట‌ర్లు ఏర్పాటు చెయ్యాల‌ని సూచించారు విజ‌య‌సాయి రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.