స్పీకర్ కోడెలను కలిసిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-07 12:31:13

స్పీకర్ కోడెలను కలిసిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా హ‌స్తిన‌లో, వైసీపీ  త‌మ గ‌ళం వినిపించింది...  ఇక వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున ఎంపీలు కేంద్రం పై పోరాటం చేస్తున్నారు.. ఇటు తెలుగుదేశం కేంద్రం నుంచి త‌మ ఇద్ద‌రు మంత్రుల‌ను మంత్రి మండ‌లి నుంచి వైదొలిగే చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించకుండా, నిర్ణ‌యాలు తీసుకోకుండా ఇంకా ఫ్ల‌కార్డులు మాత్ర‌మే చూపుతూ కాల‌యాప‌న చేస్తున్నారు అని అంటున్నారు, ఇటు కేంద్రం పై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ కూడా రెడీ అవుతోంది.
 
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావును  క‌లిశారు.. ఏపీ  అసెంబ్లీలో ఫిరాయించి టిడిపిలో చేరిన ఇరవైరెండు మంది వైసీపీ  ఎమ్మెల్యేలపై వేటు వేయాలని వారు కోరారు. వీరిలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పీక‌ర్ ను క‌లిశారు.. ఫిరాయింపుల‌పై వేటు వేయాల‌ని స్పీక‌ర్ కు మ‌రోసారి తెలియ‌చేశారు.
 
ఇదే  విష‌యంలో  గతంలో కూడా ఒకసారి వినతిపత్రం ఇచ్చామని, మరోసారి ఇప్పుడు కలిశామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. అలాగే  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు రెండేళ్ల జైలు శిక్ష పడినందున, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయనను అనర్హుడిని చేసి ఆ సీటు ఖాళీ అయినట్లు నోటిఫై చేయాలని కూడా స్పీకర్ ను కోరామని ఆయన తెలిపారు. 
 
అయితే ఇరు పార్టీల‌కు ఒకే విధంగా న్యాయం చేయాల్సిన స్పీక‌ర్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారా అని వైసీపీ ఆలోచిస్తోంది...  ఇటు తెలుగుదేశం వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి రాజ్య‌స‌భ సీటు వైసీపీకి రాకుండా చేయాలి అనే ఆలోచ‌న‌లో ఉంది.. ఆప‌రేష‌న్ ఫేస్ 3 కి కంక‌ణం క‌ట్టుకుంది అని వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.