విజ‌య‌సాయి రెడ్డి వ్య‌తిరేకుల‌కు మ‌రో పోటు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 15:49:53

విజ‌య‌సాయి రెడ్డి వ్య‌తిరేకుల‌కు మ‌రో పోటు

వైఎస్ కుటుంబానికి మూడు త‌రాలుగా సేవ‌లందిస్తూ వారి ఆర్థిక వ్యవహారాల‌ను తన భుజానికి వేసుకున్నారు విజయసాయిరెడ్డి..వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత వైయ‌స్ జ‌గ‌న్‌కు తోడుగా ఉండ‌డానికి క్రీయాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారాయ‌న‌...ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే  వైసీపీ త‌రుపున రాజ్యసభకు పంపారు వైయ‌స్ జ‌గ‌న్‌.  
 
విజ‌య‌సాయి రెడ్డి దిల్లీ రాజ‌కీయాల్లోకి ఎంట్‌ర్ అయిన త‌ర్వాత వైసీపీ ద‌శాదిశ‌ మారింద‌న‌డంలో అతి శ‌యోక్తి లేదు. దీని వ‌ల్ల ఎప్పుడు జ‌గ‌న్ విమ‌ర్శించే టీడీపీ  పార్టీ  నాయ‌కులు, సీఎం చంద్రబాబు సహా మొత్తం సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.   ప్రధాని కార్యాలయంలో  ఏ2 ముద్దాయికి ఏమి ప‌ని అంటూ ప్ర‌శ్నిస్తున్నారు...  మోడీ కాళ్లు మొక్కి, మొత్తం 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడని ఆరోపిస్తున్నారు.... చివ‌రికి జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను సైతం వ‌దిలి కేవ‌లం విజ‌య‌సాయి రెడ్డి పైనే గురి పెడుతున్నారు టీడీపీ నాయ‌కులు.
 
దీనికి విజ‌య‌సాయి రెడ్డి  ధీటుగా స‌మాధానాలిస్తున్నారు. త‌న పై ఎవ‌రైనా అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తే పాత నాటుసారా అమ్మకాల బాగోతాలు, పేకాట క్లబ్బుల దగ్గర్నుంచీ తవ్వుతాన‌ని హెచ్చ‌రించారు. అదే సమయంలో కేంద్రంలో రకరకాల పార్టీల నేతల్ని కలుస్తూ వైసీపీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. 
 
 
తెలుగుదేశం నేతలు విజ‌య‌సాయి రెడ్డిని విమ‌ర్శించే కోద్ది ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు ప్ర‌ధాని మోదీ. సీఎంవో కార్యాల‌యం  ఆర్థిక నేరస్థులకు అడ్డాగా మారిందంటూ చంద్రబాబు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో కాళ్లు మొక్కిన వ్యవహారం రచ్చ అవ్వ‌డంతో…  ప్ర‌ధాని మోదీ నిజ‌స్వ‌రూపం చూపిస్తున్నార‌ట‌. ఏకంగా విజ‌య‌సాయి రెడ్డిని కార్యాల‌యానికి పిలిపించి నువ్వేదో పుస్తకం రాశావటగా, తీసుకురారాదూ, ఆవిష్కరించేద్దాం… అని అన్నార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న టీడీపీ కారాలు మిరియాలు నూరుతోంది. మ‌రి వాట్ నెక్ట్స్ అనేది కాల‌మే చూపాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.