బాబు- లోకేష్ చిట్టా బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy fires on chandrababu naidu
Updated:  2018-03-22 03:45:11

బాబు- లోకేష్ చిట్టా బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బీజేపీ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూనే ఉన్నారు.. ఇక అవిశ్వాస తీర్మానాల పై ఎటువంటి చ‌ర్చ జ‌రుగ‌కుండానే స‌భ జ‌రుగుతూ ఉంది... ఐదురోజులుగా స‌భ ఇదే విధంగా జ‌రుగుతోంది... ఇటు వెల్ లోకి స‌భ్యులు రావ‌డంతో చ‌ర్చ‌ ముందుకు వెళ్ల‌డం లేదు పార్ల‌మెంట్లో.... స‌భ‌ను  స్పీక‌ర్ వాయిదా వేయ‌డం ప‌ట్ల ఇటు వైసీపీ కూడా విమ‌ర్శ‌లు చేస్తోంది.
 
ఇక వైసీపీ ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం పై ఫైర్ అయ్యారు.. ఏపీలో తెలుగుదేశం స‌ర్కారుపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.. ఏపీలో అనేక అవినీతి అవ‌క‌త‌వ‌కలు జ‌రుగుతున్నాయి అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. దీనిపై విచార‌ణ జ‌రిగితే క‌చ్చితంగా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయి అని అన్నారు.
 
సీఎం చంద్ర‌బాబు మంత్రి లోకేష్ పై అవినీతి అక్ర‌మాల ఆరోప‌ణ‌లు వ‌స్తే ఎందుకు విచార‌ణ‌కు సిద్దం కావ‌డం లేద‌ని,  అవినీతి చేయ‌క‌పోతే విచార‌ణ‌కు సిద్దం కావాలి అని సూచించారు.. ఏపీలో ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌తీ ప‌థ‌కంలో మంత్రి లోకేష్ అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న తెలియ‌చేశారు.
 
ఇటు ఏపీలో అవినీతి చేసి చంద్ర‌బాబు లోకేష్ ల‌క్షా ఐదు వేల కోట్ల న‌ల్ల‌ద‌నాన్ని విదేశాల‌కు త‌ర‌లించారు అని విమ‌ర్శించారు.. అవినీతి చేయ‌క‌పోతే చంద్ర‌బాబు లోకేష్ సీబీఐ విచార‌ణ‌కు సిద్ద‌ప‌డాలి అని తెలియ‌చేశారు.. ఈ అవినీతి అక్ర‌మాలపై చంద్ర‌బాబు వారంలోగా విచార‌ణ‌కు సిద్ద‌ప‌డ‌క‌పోతే అవినీతి జ‌రిగింది అని ఒప్పుకున్న‌ట్లే అని స‌వాల్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.