విజ‌య‌సాయిరెడ్డి బ‌కాసుర పంచ్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-16 14:36:34

విజ‌య‌సాయిరెడ్డి బ‌కాసుర పంచ్ ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యాలు, సీఎంగా ఎలా ఆలోచించి తీసుకుంటున్నార‌ని, అస‌లు ప్ర‌త్యేక హూదా పై ఒక్క మాట‌మీద నిల‌బ‌డ‌ని వ్య‌క్తి చంద్ర‌బాబు అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది... ప్ర‌త్యేక హూదా కోసం నిర‌స‌న‌లు ఉద్య‌మాలు రిలేదీక్ష‌లు చేస్తున్న పోరాట స‌మితి, అదే విధంగా వైసీపీ నేడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.ఈ పిలుపు మేర‌కు రాష్ట్రంలో శాంతి యుతంగా బంద్ జ‌రుగుతోంది ఇక  వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు.
 
చంద్ర‌బాబు రాక్ష‌సుడైన బ‌కాసురుడు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు...అన్నంతో పాటు అన్నం తెచ్చిన వ్యక్తిని, అన్నం బండిని లాక్కుని వచ్చిన ఎడ్లను కూడా మింగే బకాసురుడి లాంటి వారే చంద్రబాబు అని విమర్శించారు విజ‌య‌సాయిరెడ్డి.. ఆయ‌న దీక్ష‌లు చేస్తే ప‌ర్వాలేదు మిగిలిన వారు చేస్తే దొంగ దీక్ష‌లా చంద్రబాబు నైజం అటువంటిది అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఏపీలో బంద్ జ‌రుగ‌కూడ‌దు అని విఫ‌లం చేసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు ప‌న్నుతున్నారు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలంటూ బాబు ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రపంచంలో  ఎక్క‌డైనా ప్రతి దేశం వారివారి చరిత్రను చూసి, చదువుకుని గర్వపడుతారని.. కానీ చంద్రబాబు మాత్రం చరిత్రను రూపుమాపాలని ప్రయత్నించిన చరిత్ర హీనుడని విజయసాయిరెడ్డి విమ‌ర్శించారు.. చ‌రిత్ర ఉండ‌కూడ‌దు అనే ఆలోచ‌న చంద్ర‌బాబుది అని ఆయ‌న అన్నారు... బంద్ కు స‌హ‌క‌రించిన అన్ని రాజ‌కీయ పార్టీల‌కు కృతజ్ఞతలు చెబుతున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు...ప్ర‌త్యేక హూదా కోసం ఎంత వ‌ర‌కూ అయినా పోరాటం చేస్తాము అని తెలియ‌చేశారు ఎంపీ విజయ‌సాయిరెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.