ప‌ప్పునాయుడికి విజ‌య‌సాయిరెడ్డి ఆరు పంచ్ లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:49:08

ప‌ప్పునాయుడికి విజ‌య‌సాయిరెడ్డి ఆరు పంచ్ లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు హ‌స్తిన ప‌ర్య‌ట‌న పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు... ఇక్క‌డ చేసేది ఏమి లేదు ఫోటోలు తీసుకోవ‌డానికి చంద్ర‌బాబు పార్ల‌మెంట్ కు వ‌చ్చారు  అని విమ‌ర్శ‌లు చేశారు...త‌న‌ని తాను నిప్పుగా చెప్పుకునే వ్య‌క్తి  సీఎం చంద్ర‌బాబు అని, ఆయ‌న మాట‌ల‌పై అంద‌రూ ఆయ‌న్ని  యూట‌ర్న్ అంకుల్ అంటారు అనేది తెలిసిందే అని విమర్శించారు.. ఇప్ప‌టికే 29 సార్లు వ‌చ్చారు దిల్లీ,  ఇప్పుడు 30 వ‌సారి వ‌చ్చారు యూట‌ర్న్ అంకుల్ అని ఎద్దెవా చేశారు... ఇక  ప‌ప్పు వ‌చ్చారో లేదో తెలియ‌దు నేను సెంట్ర‌ల్ హాల్ లో చూస్తూ ఉన్నాఈ తెలుగుదేశం నాయ‌కుల చేసే ప‌ని అని ఆయ‌న అన్నారు.
 
లోక్ స‌భ‌లో తెలుగుదేశం ఎంపీలు 15 మంది, రాజ్య‌స‌భ‌లో ఆరుగురు పార్ల‌మెంట్ స‌భ్యులు యూట‌ర్న్ అంకుల్ చుట్టూ చేరి, ప్ర‌తీ పార్టీ నాయ‌కుల‌కు బ‌తిమలాడుకుంటున్నారు అని ఇంకా కాలు ప‌ట్ట‌కోలేదు మేం వారి  ఫోటోలు తీస్తాం అని  భ‌య‌ప‌డి ఆ ప‌ని చేయ‌లేదు అని విమ‌ర్శించారు విజ‌య‌సాయిరెడ్డి..... గ‌తంలో నేష‌న‌ల్ ఫ్రంట్ క‌న్వీన‌ర్ అని ఒక్క‌సారి క‌ల‌వండి అని బాబుగారితో క‌ర‌చాల‌నం తీసుకోండి అని తెలుగుదేశం ఎంపీలు ప్రాకులాడుతున్నారు వారి చుట్టూ తిరుగుతున్నారు అని ఆయ‌న మండిప‌డ్డారు.. అది ఇక్క‌డ బాబు క్రెడిబులిటి అని ఆయ‌న ఎద్దెవా చేశారు.
 
సంవ‌త్సరం ఆరు నెల‌ల ముందు గుంటూరులో శ‌ర‌త్ యాద‌వ్, అఖిలేష్,డీ రాజా, సుర‌వ‌రం సుధాక‌ర్ గారు స‌మావేశం నిర్వహించారు... అప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం చేశారు..... అయితే యూట‌ర్న్ అంకుల్  అప్పుడు రాజ‌కీయ ప‌క్షాల పై రాళ్లు వేయ‌డం ట‌మోటాలు వేయించ‌డం తెలిసిందే..ఇప్పుడు ఇక్క‌డ బాబుని వారు ఎలా న‌మ్ముతారు అని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక మంత్రి లోకేష్ పై ఆయ‌న స‌టైర్లు వేశారు.
 
ప‌ప్పు గారు  నాపై నిన్న విమ‌ర్శ‌లు  చేశారు...  విజ‌య‌సాయిరెడ్డి భాజాపా ఎంపీనా,  విజ‌యిసాయిరెడ్డి వైసీపీ త‌ర‌పున ఎన్నికైన వ్య‌క్తా అని... నేను మీ మాదిరి రాజకీయాలు చేయ్య‌ను... మా పార్టీ త‌ర‌పున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను ఎంపీల‌కు ఎలా కొన్నారో అంద‌రికి తెలుసు నేను జ‌గ‌న్ బీఫాం ఇస్తే రాజ్య‌స‌భ‌కు ఎన్నికై వ‌చ్చిన వ్య‌క్తిని అని తెలియ‌చేశారు...
 
ఇక నాకు పీఎంవోలో ప‌ని ఏమిటి అంటున్నారు నేను జైలుకి వెళ‌తాను అంటున్నారు... మ‌రి అది మీ ఫాద‌ర్ కి కూడా వ‌స్తుంది అని తెలియ‌చేశారు.. ఇక నాకు హైద‌రాబాద్ లో ప‌ని ఏమిటి అని అనేమీరు అస‌లు శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ ఎందుకు వ‌స్తున్నారు మీ 150 కోట్ల రూపాయ‌ల ఇంటిలో ఉండ‌టానికి రావ‌డం లేదా.. ఇక మీకు మీ నాన్న‌గారు మూడు ఫోర్ట్ ఫోలియోలు ఇచ్చారు.. అవినీతి, అక్ర‌మం, అన్యాయం అనే మూడు ఫోర్ట్ ఫోలియోలు ఇచ్చారు అని ఎద్దెవా చేశారు..
 
మీ పై  జ‌న‌సేన అధ్య‌క్షులు ఆరోప‌ణ‌లు చేశారు.. ఈ ప‌ప్పు నాయుడు ఎంత అక్ర‌మాలు అన్యాయ‌లు చేశారో ఆయ‌న తెలియ‌చేశారు మీకు చిత్తశుద్ది ఉంటే పోల‌వ‌రం, భూ కుంభ‌కోణాలు, అమ‌రావ‌తి అన్నింటి పై సీబీఐ విచార‌ణ వేసుకోండి, అప్పుడు నిర్దోషిగా రండి అని విజ‌యసాయిరెడ్డి  స‌వాల్ చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.