బాబు ప్లాన్ బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy  chandrababu naidu
Updated:  2018-03-23 04:33:15

బాబు ప్లాన్ బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

రాజ‌కీయ పార్టీలు క‌ల‌వ‌డం అలెయెన్స్ తీసుకోవ‌డం అంటే వారి ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాయి అంటారు..  ఇక ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ ఎన్డీయేతో క‌లిసే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు ఇటు వైసీపీ నాయ‌కులు... అయితే రెండు రోజులుగా విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం పై ఏపీ తెలుగుదేశం నాయ‌కులు మండిప‌డుతున్నారు... సీఎం ఏకంగా విజ‌య‌సాయి రెడ్డి ఎందుకు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారు అని ప్ర‌శ్నించారు... అయితే ఇటువంటి ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డం విజ‌య‌సాయిరెడ్డిని తెలుగుదేశం టార్గెట్ చేయ‌డం ప‌ట్ల రాజ‌కీయంగా కాస్త అల‌జ‌డి ఏపీలో క‌నిపిస్తోంది అని తెలుస్తోంది.
 
ఇక తాజాగా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు పై తెలుగుదేశం పై ఫైర్ అయ్యారు..రాజకీయ పార్టీలు, కూటములకు విడాకులు ఇవ్వడం, మళ్లీ మళ్లీ కలిసిపోవడం బాబుకు ష‌రామాములే అని అన్నారు విజ‌యసాయిరెడ్డి..కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీల రహస్య భేటీలు, ప్యాకేజీ సాధన కోసం జరుగుతోన్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు.చంద్ర‌బాబు అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తిరిగి బీజేపీతో రీయూనియన్‌ అయ్యేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.
 
తన నాలుగేళ్ల పాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బీజేపీకి తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో మాదిరి ఆయన చేస్తోన్న డబుల్‌, ట్రిపుల్‌ యాక్షన్లను ప్రజలు గమనిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన బాబుకు జనం బుద్ధిచెప్పేరోజు ఎంతో దూరంలోలేదు. కూటముల్లోకి వెళ్లడం, మళ్లీ విడాకులు తీసుకోవడం ఆయనకు అలవాటే  అని విజయసాయి అన్నారు.
 
ఇక త‌న‌పై వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు రాజ‌కీయం గురించి ఆయ‌న మండిప‌డ్డారు..... నేరస్తుల అడ్డాగా మారిందంటూ ప్రధాని కార్యాలయం ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ప్రివిలేజ్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. బాబుని వ‌దిలిపెట్టేది లేదు అని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.