బాబుకు కొత్త పేరు పెట్టిన విజ‌యసాయి రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and vijaya sai reddy
Updated:  2018-08-13 04:51:36

బాబుకు కొత్త పేరు పెట్టిన విజ‌యసాయి రెడ్డి

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విచ్చ‌ల‌విడిగా త‌న ఆస్తుల‌ను పెంచుకునేందుకు రాష్ట్రాన్ని ఊబిలో నెట్టేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసింది ఏమీ లేద‌ని ఆయన ఆరోపించారు. 
 
రాజ‌కీయంగా ల‌బ్ది పొందేందుకు ఎలాంటి కార్య‌క్రమానికి అయినా పాల్ప‌డ‌తార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. ఇదే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రాష్ట్రాన్ని విడ‌దీసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని ఆయ‌న ఒక‌ గ‌జ‌దొంగ అని చంద్ర‌బాబును తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. త‌న అవస‌రాల కోసం చంద్ర‌బాబు ఏ పార్టీతో అయినా లాలూచీ ప‌డే వ్య‌క్తి అని విజ‌య‌సాయి రెడ్డి మండిపడ్డారు. 
 
గతంలో అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించార‌ని అయితే వారిపై చ‌ర్య తీసుకోవాల‌ని తాము స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆయ‌న ఎలాంటి చ‌ర్య తీసుకోలేద‌ని గుర్తు