పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హూదా ఉద్యమం తారాస్ధాయికి చేరింది అని చెప్పాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం పై నోటీసులు ఇవ్వడం తెలుగుదేశం కూడా ఇవ్వడం నేడు చర్చకు వస్తుంది అనుకున్న సమయంలో కావేరి బోర్డు సమస్యపై అన్నాడీఎంకే వెల్ లో నినాదాలు చేయడంతో కాంగ్రెస్ అన్నాడీఎంకే మధ్య వార్ జరిగింది దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.
ఇక సభలో విజయసాయిరెడ్డి ఆంధ్రుల పరువు తీశారని ప్రధాని నరేంద్రమోడీ కాళ్లు విజయసాయిరెడ్డి సభలో పట్టుకున్నారని ఇది ఆంధ్రుల పరువును తాకట్టు పెట్టినట్టే అని సీఎం రమేష్ మండిపడ్డారు దీనికి సంబంధించి ఆధారాలు బయటపెడతా అని అన్నారుదీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.. టీడీపీ అంటే దొంగల పార్టీ అని అన్నారు.. ఈ దొంగల ముఠాకు చంద్రబాబు నాయుడు రథసారధి అని అన్నారు బాబు వెనుక మేము వెళ్లం అని అన్నారు విజయసాయిరెడ్డి... తెలుగుదేశం ప్రత్యేక హూదా గురించి ఇప్పుడు మాట్లాడటం తగదు అని విమర్శించారు.
చంద్రబాబుని అందరూ యూ టర్న్ అంకుల్ అంటున్నారని ఆయన విమర్శించారు.. ఇక అధికారంలో ఉండి తెలుగుదేశం 18 కేసులను మాఫీ చేయించుకున్నారు అని చిత్తశుద్ది ఉంటే ఓటుకునోటు కేసును సీబీఐ విచారణకు పంపాలి అని అన్నారు ఆయన.. చంద్రబాబు ఓ ఆర్దిక నేరగాడు అని విమర్శంచారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబు నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నాటుసారా అమ్ముకుని బతికాడు సీఎం రమేష్ బండారం రెండు మూడు రోజుల్లో బయటపెడతా, తనపై ఆరోపణలు చేసే అంత గొప్ప ఖ్యాతి సీఎం రమేష్ కు తెలుగుదేశం ఎంపీలకు లేదు అని ఆయన విమర్శలు చేశారు.
ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్ట్ నిధులు పెంచుకున్న వ్యక్తి సీఎం రమేష్... మొత్తం పుటేజీని బయటపెడతే వాస్తవాలు బయటపడతాయి అని ఫైర్ అయ్యారు.. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన ఆర్దిక నేరగాడు సుజనా చౌదరి, సుజనా ఓ ఆర్ధిక నేరగాడు ఇరువురు నేరగాళ్లు ఎందుకు అరుణ్ జైట్టీని కలిశారు... చందబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే చందంగా ఉంటాడు... నాకు చంద్రబాబు ఎదురొచ్చినా నమస్కారం చేస్తా అలాగే ప్రధానికి చేశా ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఎవరూ చేయరు తెలుగుదేశం నాయకులు చేస్తారు అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
Comments