విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mp vijaya sai reddy
Updated:  2018-06-13 05:58:34

విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ, త‌న‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌ధాన అర్చ‌కులు నోటీసులు పంపించారనే వార్త‌ల‌పై స్పందించారు. త‌న‌కు టీటీడీ బోర్డు నుంచి ఎలాంటి నోటీసులు రాలేద‌ని స్ప‌ష్టం చేశారు.ఒక వేళ‌ నోటీసులు పంపితే చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. టీటీడీ బోర్డు త‌రపున తాను గ‌తంలో నాలుగు సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాన‌ని అస‌లు టీటీడీ నోటీసు పంపించే అధికారం లేద‌ని అన్నారు.
 
టీటీడీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు దొంగ‌త‌నం చేశార‌ని, టీడీపీలో ఉన్న న‌గ‌ల‌న్ని త‌వ్వుకుని వెళ్లార‌ని విజ‌య‌సాయి రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. అలాగే ఆయ‌న కూమారుడు మంత్రి నారాలోకేశ్ కూడా టీటీడీలో న‌గ‌ల‌ను స్వ‌యానా ద‌గ్గ‌రుండి విదేశాల‌కు త‌ర‌లించార‌ని మండిప‌డ్డారు. న‌గ‌లు పోయాయ‌ని ముఖ్య‌మంత్రి ఆయ‌న కుమారుడిపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి కాబ‌ట్టి మొద‌టిగా వీరిపై సీబీఐ విచార‌ణ చేయాల‌ని విజ‌య‌సాయి రెడ్డి డిమాండ్ చేశారు. విచార‌ణ చేసిన త‌ర్వాత త‌నను పిల‌వాల‌ని విజ‌య‌సాయి రెడ్డి స్పష్టం చేశారు.
 
చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్నారు క‌దా ఏదైనా చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ని అయితే వారి బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డేదిలేద‌ని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడికి ఆయ‌న సంచ‌ల‌న సవాల్ విసిరారు. టీటీడీ విష‌యంలో తాను ముఖ్య‌మంత్రికి 13 గంట‌లు స‌మయం ఇచ్చాన‌ని, తాను చేసిన ఈ ఆరోప‌ణ‌ల్లో అవాస్త‌వం ఉన్న‌ట్లు అయితే తాను ఖచ్చితంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. తాను చేసిన ఈ ఆరోప‌ణల గురించి సుమారు 240 గంట‌లు ముగినసి త‌ర్వాత స్పందిస్తున్నార‌ని మండిప‌డ్డారు. 
 
ఈ 240 గంట‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు చేయాల్సిన కార్య‌క్ర‌మాలు అన్ని చేసేసుకుని ఈ రోజు మీరు స్పందిస్తారా అని విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఖ‌జానాను పూర్తిగా స్వాధీనం చేసుకున్న త‌ర్వాత చివ‌ర‌కు దేవ‌స్థానంలో ఉన్న సొమ్ముల‌ను దోచుకున్న మీరు త‌మ‌కు నోటీసులు ఇచ్చే అధికారం ఎక్క‌డినుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. 2019 లో వైఎస్ జ‌గ‌న్‌ అధికారంలోకి వస్తే ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు నాయుడి ప‌రిపాల‌న‌లో జ‌రిగిన‌ అవ‌క‌త‌వ‌క‌ల‌న్నింటిపై విచార‌ణ‌ చేయిస్తామ‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
అలాగే తాను గ‌తంలో 10 అంశాల‌పై టీడీపీని ప్ర‌స్తావించాన‌ని, అయితే ఇప్పుడు 14 అంశాల‌పై ప్ర‌స్తావిస్తున్నాన‌ని అన్నారు అందులో మొద‌టిగా.. 
 
పోల‌వ‌రం, ప‌ట్టిసీమ పురుషోత్తంప‌ట్నంలో మీరు చేసిన అవ‌క‌త‌వ‌క‌లు
రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌కు ముందే చంద్ర‌బాబు బినామీల‌తో భూముల‌ను కొనుగోలు చేసిన‌టువంటి వైనం
తాత్కాలిక స‌చివాల‌యం అసెంబ్లీ నిర్మాణం అవినీతి
అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంలో నాలుగేళ్లుగా చేతులుమారి వేల‌కోట్ల కుంభ‌కోణం
బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, బాబు కూమారుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, బాబు కుటుంబం విదేశీ ప‌ర్య‌ట‌న‌లు
కాల్ మ‌నీ సెక్స్ రాకెట్
ఓటుకు నోటు కేసు
ఐఎమ్ జీ భార‌త్ స్కామ్
అగ్రీడోల్డ్ స్కామ్
బాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు
లోకేశ్ బాబు, ప‌ప్పు బాబు సంపాద‌న‌
తిరుమ‌ల‌లో అరాచ‌కాలు
సింగ‌పూర్ కంపెనీల‌కు రాజ‌ధాని భూములు అప్ప‌గించుట‌
నీరు-చెట్టు కింద మీరు చేసిన‌టువంటి అవినీతి
భూసేక‌ర‌ణ, భూ స‌మీక‌ర‌ణ పేరుతో మీరు చేసిన‌టువంటి అరాచ‌కాలు
 
వీట‌న్నింటిపైన చంద్ర‌బాబుకు ద‌మ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచార‌ణ చేయాల‌ని విజ‌య‌సాయి రెడ్డి డిమాండ్ చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.