తండ్రికొడుకులకు బెంగ‌గా ఉందా...విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sai reddy and chandrababu and lokesh
Updated:  2018-10-12 05:51:23

తండ్రికొడుకులకు బెంగ‌గా ఉందా...విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ట్వీట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు నివాసాల‌పై కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌కు సంబంధించి తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీటియాలో ట్వీట్ చేశారు.
 
శ్రీకాకుళం కోసం కాదు, సీఎం రమేష్ మీద ఐటీ దాడుల ముందస్తు సమాచారంతోనే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు నిద్ర పట్టలేదని ఈ విష‌యం రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమైంది అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ట‌ర్ లో పేర్కొన్నారు.
tweet
 
మ‌రో ట్వీట్ చేస్తూ మీ బినామీలపై జరుగుతున్న ఐటీ దాడులు ఆంధ్రులపై దాడులా..? తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి ప్రాజెక్ట్ లను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న లక్షల కోట్లు ఏ రూటులో దేశం దాటిపోతున్నవో ఐటీ దాడుల్లో బయటపడిపోతుందని బెంగగా ఉందా ఉత్తర కుమారా ఉరఫ్ లోకేశా..? అంటూ ట్వీట్ చేశారు విజ‌య‌సాయి రెడ్డి.
sai reddy tweet
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.