అది ఒక బోగ‌స్ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 13:48:40

అది ఒక బోగ‌స్ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని తెలుగుదేశం పార్టీపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం, నిర్వ‌హించిన స‌ర్వేపై ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ రెండు స‌ర్వేలు క‌ల్పిత‌మైనవ‌ని, వారికి వారు స‌ర్వే నిర్వ‌హించుకున్న‌ట్టు త‌మ ప‌రిశీల‌న‌లో తేలిపోయింద‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
గతంలో ఏపీలో నిర్వ‌హించిన స‌ర్వేను ఏబీఎన్ ఛాన‌ల్ యాజ‌మాన్యం వాడుకుంద‌ని ల‌గ‌డ‌పాటి చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. అంతే కాదు ఆయ‌న స‌ర్వే నిర్వ‌హిస్తే ఆ ఫ‌లితాల‌ను మీడియా స‌మ‌క్షంలో విడుద‌ల చేయ‌డం ల‌గ‌డ‌పాటికి సంప్ర‌దాయం అని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు.
 
రాష్ట్రంలో ఏబీఎన్ ఛాన‌ల్ నిర్వ‌హించిన స‌ర్వే స‌మాచారం అస‌లు క్రోడీక‌రించ‌లేద‌ని అన్నారు. అయితే కేవ‌లం ప్ర‌జ‌లను మ‌భ్య‌పెట్టేందుకు ఈ ఛాన‌ల్ ఒక దొంగాట ఆడింద‌ని, త‌మ ప‌రిశీల‌న‌లో తేలింద‌ని విజ‌య‌సాయి రెడ్డి పేర్కొన్నారు. లగడపాటి పేరుతో ఏబీఎన్‌ ప్రసారం చేసిన సర్వే ఒక బోగస్‌ అని, ఈ సర్వే ఏబీఎన్‌ సృష్టించిందని, సర్వేకు చంద్రబాబు ఆర్థికంగా సహకరించారన్నారు. 
 
రాష్ట్రంలో ఎవ‌రెన్ని స‌ర్వేల‌ను నిర్వ‌హించినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్నారు. ఇలాంటి స‌ర్వేల‌ను చూసి వైసీపీ కార్య‌క‌ర్త‌లు టెన్ష‌న్ ప‌డ‌వ‌ద్ద‌ని విజ‌య‌సాయి రెడ్డి సూచించారు. అలాగే ఈ స‌ర్వేపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ల‌గ‌డ‌పాటి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని విజ‌య‌సాయి రెడ్డి సూచించారు.
 
Contd...Inquires have further revealed that the survey team has only provided raw data and did not translate data into number of seats. ABN has done foul play in converting data into numbers.
 
It is proved that the survey of ABN AndhraJyothi is self-made & fabricated as  Lagadapati garu clarified  "ABN has used the team which was earlier engaged by me" further said it is his consistence practise to hold a PC and disclose by himself the result of survey.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.