విజ‌యసాయి రెడ్డి కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-06 17:01:01

విజ‌యసాయి రెడ్డి కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంకల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ఎండా, గాలీ, వ‌ర్షం అన్న తేడా లేకుండా రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట తూర్పుగోదావ‌రి జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారి స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే వాట‌న్నింటిని మాఫీ చేస్తాన‌ని కొండంత భ‌రోసా ఇస్తున్నారు.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మ‌రికొద్ది రోజుల్లో విశాఖ‌ ప‌ట్నంకు చేరుకోనున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను విజ‌య‌వంతం చెయ్యాలని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేర‌కు విశాఖ‌లో పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయి ఈ విష‌యం పై ఆయ‌న‌ చ‌ర్చించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ విశాఖకు వ‌స్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ శ్రేణులంతా అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌రథం ప‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
 
ఈ స‌మావేశంలో విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ, త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్ని చూసి అధికార తెలుగు దేశంపార్టీ నాయ‌కులు ఓర్వ‌లేక పోతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 2014 నుంచి టీడీపీ నాయ‌కులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీ కోసం ప‌ని చేశామ‌ని ఇక వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే ఉత్సాహంతో ప‌నిచెయ్యాల‌ని విజ‌యసాయి రెడ్డి పార్టీ నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. 
 
బూత్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసి పార్టీని మ‌రింత బ‌లోపేతం చెయ్యాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అంతేకాదు స్థానికంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చేకూరుతుంద‌ని భ‌రోసా ఇవ్వాల‌ని విజ‌య‌సాయిరెడ్డి సూచించారు. గ‌తంలో త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని ఇప్పుడు ప్ర‌జ‌లు న‌మ్మ‌డంలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.