తండ్రి, కొడుకు అక్క‌డికి వెళ్లాల్సిందే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:10:44

తండ్రి, కొడుకు అక్క‌డికి వెళ్లాల్సిందే

ఏపీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవత్స‌రాలు పూర్తి చేసుకున్నార‌ని, అయితే  ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో రాష్ట్రంలో ఎటు చూసినా అవినీతి అక్ర‌మాల‌తో కూరుకుపోయింద‌ని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.
 
అంతే కాదు ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 3 ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని అధికార‌బలంతో అక్ర‌మంగా చంద్ర‌బాబునాయుడు విదేశాల‌కు త‌ర‌లించార‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. అధికారంతో ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఉన్న న‌గ‌ల‌ను తండ్రి కొడుకులు క‌ల‌సి దోచుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. అయితే రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేశ్‌లు జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.
 
అలాగే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సూమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అయితే  చంద్ర‌బాబు అధికారంలో వ‌చ్చాక ఒక్క హామీను అయినా పూర్తిగా అమ‌లు చేశారా అని విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శ్నించారు. 
 
ఇక 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు ఎన్ని హామీల‌ను ప్ర‌క‌టించినా న‌మ్మ‌ర‌ని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును నిర్మించడం చంద్ర‌బాబుతో సాధ్యంకాద‌ని ఆయ‌న ఇంకో రెండు సార్లు ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నా కూడా పుర్తి చేయ‌లేర‌ని విజ‌య‌సాయి రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. పోల‌వ‌రంప్రాజెక్ట్  వైఎస్‌ఆర్‌ కల అని, తమ ప్రభుత్వం ఏర్పడితే పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని విజ‌య‌సాయి రెడ్డి హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.