చంద్ర‌బాబు దుర్మార్గుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and sai reddy
Updated:  2018-09-06 01:17:34

చంద్ర‌బాబు దుర్మార్గుడు

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఒక ఫ్యాక్ష‌నిస్ట్ అని కేసుల‌కు బ‌య‌ప‌డి ఆయ‌న స్పీక‌ర్ అయ్యార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, 2014లో అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దుర్మార్గ‌మైన వ్య‌క్తి అని, ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో స‌మారు 3 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీపై మోపుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే వారు చేసిన‌ ప్ర‌తీ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన బుద్ది చెబుతార‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.
 
అంతేకాదు చంద్ర‌బాబు నాయుడు వైసీపీ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని త‌మ‌ను టార్గెట్ చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వారు చేసే టార్గెట్ లను వైసీపీ భ‌య‌ప‌డ‌ద‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.