జ‌గ‌న్ మ‌న‌సులో మాట

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:36:17

జ‌గ‌న్ మ‌న‌సులో మాట

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలు, కోస్తాలోని నాలుగు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఈ సంక‌ల్పయాత్ర‌లో జ‌న‌నేత జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు తండోప తండాలుగా త‌రలి వ‌స్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ సంక‌ల్ప‌యాత్ర‌తో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ఈ సంక‌ల్పయాత్ర‌పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న కాంమెంట్స్ చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్రకు సంఘీభావంగా విశాఖప‌ట్నంలో విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర చేపట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ పాదయాత్ర సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇలాంటి వాతావరణంలో ఎక్కడా కనబడడం లేదని అన్నారు. అయితే  జగన్ ఇంతటి మండుటెండల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా  ప్రజల కోసం నడవడం త‌న‌కు ఎంతో సంతోషంగా వుంద‌ని విజ‌య‌సాయి రెడ్డి  అన్నారు.
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల తర్వాత  వైఎస్ జ‌గ‌న్ని ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో అశ‌గా ఎదురు చూస్తున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఓ రాక్ష‌సుడి పాల‌న జ‌రుగుతోంద‌ని దానిని అంత‌మొందించేందుకు ప్ర‌జ‌లు శ‌గా ఎదురు చూస్తున్నారని ఆయ‌న తెలిపారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఒక్కొక్క‌టి  పరిష్క‌రిస్తూ రాష్ట్రం అభివృద్ది వైపు కొన‌సాగిస్తామ‌ని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.