లోకేశ్ బ‌ద్ద‌కానికి మ‌రోసారి రుజువు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-16 15:44:26

లోకేశ్ బ‌ద్ద‌కానికి మ‌రోసారి రుజువు

ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోకేశ్ త‌న ఇంటి పై క‌ప్పు మీదే పోలీసుల గౌర‌వ వంద‌నంతో ప‌తాకాన్ని ఎగ‌ర‌వేయ‌డం బ‌ద్ద‌కానికి, అధికార దుర్వినియోగానికి నిద‌ర్శ‌నం అని విమ‌ర్శించారు.
 
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్‌ నాయుడు ఒక్కరే. ఇది ఆయన శుద్ధ బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.
 
Lokesh Naidu is the only minister in the country who hoisted National Flag on 15th August 2018 at home’s Roof top that too with a salute from cops. Utter lethargy and Sheer misuse of power.

షేర్ :