విజ‌య‌సాయిరెడ్డి స‌ర్వే పంచ్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 17:19:20

విజ‌య‌సాయిరెడ్డి స‌ర్వే పంచ్ ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌తో ఏపీలో దూసుకుపోతున్నారు.. మ‌రీ ముఖ్యంగా కోస్తాలో ఆయ‌న‌కు మ‌రింత ప్ర‌జామ‌ద్ద‌తు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది... అడుగ‌డుగునా ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర రెండు వేల కిలోమీట‌ర్ల మేర పూర్తి అవ్వ‌బోతోంది..
 
ఇక జ‌గ‌న్ పాద‌య‌త్ర‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌ల్లో మ‌రింత ముందుకు వెళ్ల‌డానికి వైసీపీ కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతోంది.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీభావంగా  విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాద‌యాత్ర చేప‌ట్టారు ఆయ‌న పాద‌యాత్ర మూడోరోజుకు చేరింది. ఆయ‌న వెంట వైసీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు జిల్లా నాయ‌కులు, కేడ‌ర్ ,ప్ర‌జ‌లు, న‌డుస్తున్నారు. విశాఖ స‌మ‌స్య‌లు ఆయ‌న‌కు తెలియ‌చేస్తున్నారు..
 
మూడోరోజు మల్కాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన అడుగుడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. జై ఆంధ్రా కాలనీ మీదుగా.. ఏసీ కాలనీలో యాత్ర కొనసాగుతోంది. ఇక ఈ స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి తెలుగుదేశం స‌ర్కారు పై అలాగే సీఎం చంద్ర‌బాబు పై  విమ‌ర్శ‌లు చేశారు.
 
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సర్వేలు హెచ్చరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలపై అత్యాచారాల కేసుల్లో టీడీపీ మంత్రుల పేర్లు ఉండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ది చెబుతున్నారన్నారు. మొత్తానికి ఏ రిపోర్టు వ‌స్తున్నా అందులో తెలుగుదేశం నాయ‌కుల పేర్లు క‌చ్చితంగా ఉంటున్నాయి అని, పోటీ ప‌డుతున్నారు ఆ లిస్టుల‌కు అని వైసీపీ విమర్శిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.