బాబుకు విజ‌య‌మ్మ సూటి ప్ర‌శ్న...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijayamma-questions-to-chandrababu
Updated:  2018-04-08 03:37:16

బాబుకు విజ‌య‌మ్మ సూటి ప్ర‌శ్న...

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ కోసం ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమ‌ర‌ణ నిరిహార దీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల‌ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.. వైసీపీ ఎంపీలు చేస్తున్న త్యాగం బ‌హుశా ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేసి ఉండ‌రేమోన‌ని, రాష్ట్ర అభివృద్ది కోసం ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలును ప‌రామ‌ర్శించేందుకు అనేక మంది వెళ్తున్నారు.
 
ఇక తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లి వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ఎంపీలును ప‌రామ‌ర్శించి వారికి మ‌ద్ద‌తు తెలిపారు.. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి లాంటిద‌ని దానిని సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విజ‌య‌మ్మ మండిప‌డ్డారు.
 
వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించిన రోజునే అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే రాష్ట్రానికి ఈ గ‌తి ప‌ట్టి ఉండేది కాద‌ని ఆమె అన్నారు. గ‌త నాలుగేళ్లుగా వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ది కోసం ఎన్నో దీక్ష‌లు చేశార‌ని, కానీ వాటిని టీడీపీ నాయ‌కులు అధికార బ‌లంతో అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశార‌ని తెలిపారు..
 
నాలుగు సంవ‌త్స‌రాలుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారంలో ఉండి కూడా  రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేని అస‌మ‌ర్దుడ‌ని ఆమె అన్నారు.. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు 600 వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌ను నిలువునా మొసం చేస్తున్నార‌ని విజ‌య‌మ్మ అన్నారు...అంతే కాదు దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఏపీ అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నార‌ని, ప్రతిపక్షాలు లేకుండా చూడాలని చంద్రబాబు ప్ర‌యత్నిస్తున్నారు అని విజయమ్మ మండిప‌డ్డారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.