ప్ర‌త్యేక హూదా పోరులో వైయ‌స్ విజ‌య‌మ్మ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-09 17:03:59

ప్ర‌త్యేక హూదా పోరులో వైయ‌స్ విజ‌య‌మ్మ‌

వైసీపీ అధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌త్యేక హూదా ఊపిరి అని అన్నా...రు దిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌లో ఆమె  ఎంపీల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.. బీజేపీతో తాము పోరాటం చేస్తున్నాము అని ఆమె అన్నారు... ఆపార్టీతో తాము లాలూచి ప‌డ్డాము అని అన‌డం పై ఆమె ఫైర్ అయ్యారు.. సాక్షాత్తూ పార్లమెంటులో ప్రధానమంత్రి  ఇచ్చిన హామీకే విలువలేకుండా పోయిందని, ప్రధాని మోదీగారు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
 
చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆమె గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు నిజమైన పోరాటాన్ని చేస్తున్నారో ఏపీ ప్ర‌జ‌లు గుర్తించాలని ఆమె కోరారు. హోదా కోసం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, కలిసికట్టుగా పోరాడితే ఫలితం దక్కుతుందన్నారు..
 
అంద‌రూ రాజీనామా చేసి కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి అని ఆమె తెలియ‌చేశారు.ఇదే టీడీపీ ఎంపీలు నాలుగేళ్ల ముందు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకొని.. ఇప్పుడు మాట్లాడాలి అని అన్నారు ఆమె.. గ‌తంలో ఏమి మాట్లాడారో తెలియ‌దా అని ఆమె తెలియ‌చేశారు.
 
కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్‌సీపీ నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు.... అయినా అవిశ్వాసంపై చర్చ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు... ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనం ఉందని, ఇతర రాష్ట్రాలకు వేలకోట్లు ఇస్తూ.. ఏపీకి మాత్రం నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
 
పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజలకు జీవనాడి అని, వైఎస్‌ఆర్‌ బతికి ఉంటే ఆ ప్రాజెక్టు ఏనాడో పూర్తయ్యేదని పేర్కొన్నారు. వైయ‌స్  విజ‌య‌మ్మ‌తో పాటు వైసీపీ నాయ‌కులు ఎంపీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.. ఇక వైసీపీ నాయ‌కులు పార్టీ త‌ర‌పున రాష్ట్రంలో ప్ర‌త్యేక హూదా పోరాటం చేస్తున్నారు.... ఇటు మిథున్ రెడ్డి - అవినాష్ రెడ్డి హూదా దీక్ష హ‌స్తిన‌లో కొన‌సాగిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.