మీ బిడ్డ వ‌స్తున్నాడు ఆశీర్వ‌దించండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys vijayamma
Updated:  2018-09-03 11:56:02

మీ బిడ్డ వ‌స్తున్నాడు ఆశీర్వ‌దించండి

రాష్ట్ర‌వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ మీ బిడ్డ వ‌స్తున్నాడు ప్ర‌తీ ఒక్క‌రు ఆశీర్వ‌దించండి అంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విజ‌య‌మ్మ స్ప‌ష్టం చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 9వ వ‌ర్థంతి రోజున అమె ఇడుపులపాయ‌లో ప్ర‌త్యేక  ప్రార్థ‌న‌లు చేయించి నివాళులు అర్పించారు.
 
ఆ త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ 2019లో వైఎస్ జ‌గ‌న్ మోన్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. గతంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి హయాంలో మిగిలిపోయిన ఆశ‌యాల‌ను జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత నెర‌వేర్చుతాడ‌ని విజ‌య‌మ్మ స్ప‌ష్టం చేశారు. 
 
ఈ కార్య‌క్ర‌మానికి, కుమ‌ర్తె ష‌ర్మిల, కోడ‌లు భార‌తి, మ‌నుమ‌రాళ్లు, అల్లుడు బ్ర‌ద‌ర్ అనిల్, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిలు పాల్గొన్నారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ మ‌ళ్లీ రాజ‌న్న పాల‌న చూస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.