పార్టీకి 150 కోట్లు విరాళం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and vijay malya
Updated:  2018-04-02 14:55:42

పార్టీకి 150 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు నాయుడు పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్ధాయిలో మండిప‌డ్డారు..చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసులు అందజేశారు. తర్వాత బాబు పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు..చంద్ర‌బాబు రాజ‌కీయం దేశం అంతా తెలుసు అని అలాగే  యూట‌ర్న్ అంకుల్ రాజ‌కీయం గురించి వేరేగా చెప్పాలా ఆయ‌న దిల్లీకి ఎందుకు వ‌స్తున్నారో చెప్పాలి అని అన్నారు... గ‌తంలో అన్ని పార్టీల‌తో జ‌త‌క‌ట్టిన చంద్ర‌బాబు త‌ర్వాత అంద‌రినీ వ‌దిలిపెట్టిన సంగ‌తి తెలుసుక‌దా అన్నారు.
 
ఇప్పుడు మ‌ళ్లీ పార్ట‌న‌ర్ కోసం చంద్ర‌బాబు దిల్లీ వ‌స్తున్నారు అని తెలియ‌చేశారు..ఈ నాలుగేళ్ల‌లో చంద్ర‌బాబు పాల‌నను ఎవ‌రూ మ‌ర్చిపోరు అని అన్నారు ఆయ‌న‌.. ఇదిదుర్మార్గ‌పు పాల‌న అని ఆయ‌న ఫైర్ అయ్యారు..ఓటుకు నోట్లు కేసుతో పాటు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో చంద్రబాబు లక్ష కోట్లకు పైగా స్కామ్‌లు చేశారని ఆరోపించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరిగిన స్కాం లపై అన్నీపార్టీల నేతలు కేంద్ర నాయకత్వాలకు తెలపాలన్నారు.
 
ఇక మ‌రో పెద్ద ఆరోప‌ణ చేశారు చంద్ర‌బాబు పై విజ‌య‌సాయిరెడ్డి. 2016, మార్చిలో 12,13,14 తేదీల్లో చంద్రబాబు నాయుడు లండన్‌కు వెళ్లి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను కలిశారా? లేదా?.. మాల్యా దేశం వదిలి పారి పోయిన 10 రోజులకు మీరు కలవలేదా..? గత ఎన్నికల కోసం మాల్యా నుంచి రూ.150 కోట్ల విరాళం తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మాల్యా నుంచి తీసుకున్న విరాళాలపై చంద్రబాబు జవాబు చెప్పాలని, లేనిపక్షంలో అవన్నీ వాస్తవాలు అనుకోవాల్సి వస్తుందన్నారు.
 
కొత్త కొత్త విష‌యాలు విజ‌య‌సాయిరెడ్డి బ‌య‌ట‌పెడుతున్నారు కాబ‌ట్టే తెలుగుదేశం నాయ‌కులు ఆయ‌న్ని టార్గెట్  చేస్తున్నారు అనేది తాజాగా విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌ల‌తో బ‌య‌ట‌ప‌డింది.. మ‌రి దీనిపై బాబు ఎటువంటి స‌మాధానం చెబుతారు, అలాగే తెలుగుదేశం నాయ‌కుల ఎటువంటి ఆన్స‌ర్ ఇస్తారో అని చూస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.