చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి రెడ్డి ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Vijayasai Reddy
Updated:  2018-04-15 05:33:01

చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి రెడ్డి ఫైర్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సంద‌ర్శంచారు... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... విభ‌జ‌న చ‌ట్టంలో పొంద‌ప‌రిచిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం వైసీపీ అలుపెరుగ‌ని పోరాటం చేస్తోంద‌ని అన్నారు... త‌మ ఎంపీలు ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా ఆమ‌ర‌ణ నిరిహార దీక్ష‌చేస్తుంటే వారికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా పెట్టుబ‌డులు పేరుతో సింగ‌పూర్ కు తిరుగుతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.
 
అందులో భ‌గంగానే ముఖ్య‌మంత్రికి ప్ర‌త్యేక హోదా చిత్తశుద్ది లేద‌ని, ఒక‌వేళ‌ ఉంటే త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించి కేంద్రంపై పోరాటం చేయించేవార‌ని అన్నారు.. అయితే ముఖ్య‌మంత్రి చేస్తున్న ప్ర‌తీ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన బుద్ది చెబుతార‌ని తెలిపారు. 
 
గ‌తంలో ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును విజ‌య‌సాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, హోదా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారో,అక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఎన్ని ఉద్యోగాలు వ‌చ్చాయో చంద్రబాబు తెలుసుకోవాలని అన్నారు...ఆయ‌న‌ అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక మాట అవ‌స‌రం లేన‌ప్పుడు ఒక మాట మాట్లాడి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాకుండా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
అందులో భ‌గంగానే త‌మ పార్టీ నేతలు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కోసం వైసీపీ వామ‌ప‌క్షాల‌తో క‌లిసి  రేపు బంద్ కు పిలుపునిస్తే ఈ బంద్ వ‌ల్ల   సీఎం ప్రయోజనం లేదంటున్నారని అన్నారు.. మీరు అధికారంలో లేని రోజుల్లో టీడీపీ ఎన్నిసార్లు బంద్‌కు పిలుపునిచ్చిందో తెలుసుకోవాల‌ని విజ‌య‌సాయి రెడ్డి గుర్తుచేశారు.
 

షేర్ :

Comments

1 Comment

  1. Vijayasai oka pichi kukka

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.