విజ‌య‌సాయి రెడ్డి ప్రెస్ మీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 04:29:22

విజ‌య‌సాయి రెడ్డి ప్రెస్ మీట్

 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి  శుక్ర‌వారం నాడు పార్ల‌మెంట్ లో  రెండు ప్రైవేట్ బిల్లులు ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.  బీసీల‌కు   చ‌ట్ట‌స‌భ‌లతో పాటు  ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్ధ‌ల్లో  జ‌నాభా ప్రాతిపాదిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ  పార్ల‌మెంట్ లో  ప్రైవేట్ బిల్లు ప్ర‌వేశపెట్టింది. 
 
వెనుకబ‌డిన త‌ర‌గ‌తుల వారికి కూడా జ‌నాభా ప్రాతిపాదిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ మ‌రో ప్రైవేటు బిల్లు ప్రవేశ‌పెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం  143 కులాల‌ను వెనుక‌బ‌డిన కులాలుగా ప‌రిగ‌ణించ‌డం జ‌రిగింది. ఈ కులాలు ఏపీలో ఉన్న మొత్తం జ‌నాభాలో 56 శాతంగా ఉన్న‌ట్లు   గ‌తంలో ముర‌ళీధ‌ర్ రావు క‌మీష‌న్ గుర్తించిన  విష‌యాన్ని  విజ‌య‌సాయి రెడ్డి గుర్తు చేశారు. వెనుక‌బ‌డిన కులాల‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా వారికి కేటాయించిన  రిజ‌ర్వేష‌న్ల‌ను కొన‌సాగించాల‌ని కోరారు. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఈ  రెండు బిల్లులు ప్ర‌వేశపెట్టిన‌ట్లు తెలిపారు.
 
ఇక ఓబీసీ క‌మీష‌న్ బిల్లు కూడా ఈ స‌మావేశాల్లో పాస్ అవుతంద‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ఏపీలో    సామాన్య ప్ర‌జ‌ల‌ను దోచేందుకు ఏర్పాటు చేస్తున్న విలేజ్ మాల్స్ కు  కేంద్ర ప్ర‌భుత్వం నుండి అనుమ‌తి ఉందా అంటూ పార్ల‌మెంట్ లో ప్ర‌శ్నించారు. అయితే ఆ విష‌యం రాష్ట్రానికి సంబంధించిన విష‌య‌మ‌ని, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదంటూ  సంబంధిత శాఖ మంత్రి స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.