విజ‌య‌సాయి రెడ్డి స‌రికొత్త వ్యూహాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 11:42:54

విజ‌య‌సాయి రెడ్డి స‌రికొత్త వ్యూహాం

అభిమ‌న్యుడు ప‌ద్మ‌వ్యూహాంలో చిక్కుకుని బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు.. అదే మ‌న‌కు తెలిసిన భార‌తం.. అయితే ఇప్పుడు రాజ‌కీయ కురుక్షేత్రంలో సాధ్య‌సాధ్యాలు చూసే ప‌ద్మ‌వ్యూహాల్లోకి ఎంట‌ర్ అవుతున్నారు నాయ‌కులు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే విజ‌య‌సాయిరెడ్డి ఎంపీగా త‌న ప‌టిమ‌ని చూపించారు.. 40 ఏళ్ల  రాజ‌కీయ అనుభ‌వానికి రోహిణికార్తె లాంటి మండేఎండ‌ల‌ను చూపిస్తున్నారు విజ‌య‌సాయిరెడ్డి.
 
రాజ‌కీయ చాణిక్య, ద్రోణ ,భీష్మ ,ఏమిపేర్లు ఉన్నా అన్ని ప‌టాపంచ‌ల‌వుతున్నాయి  తెలుగుదేశం అధినేత‌కు...ఈనాడు విజ‌య‌సాయిరెడ్డి త‌న రాజ‌కీయ చ‌తుర‌త చూపుతున్నారు వైసీపీలో.. ఏపీ రాజ‌కీయాలు ప‌క్క‌న పెడితే,  దిల్లీలో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఉండి, కేంద్రంలో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజ‌య‌సాయిరెడ్డి. రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయిరెడ్డి కి అంత పేరు ప్ర‌ఖ్యాత‌లు త‌న గ‌ళంతోనే స్నేహ‌పూరిత మైత్రి బంధంతోనే సంపాదించుకున్నారు.
 
అయితే పార్టీలో క్రియాశీల‌క నాయ‌కుడు నంబ‌ర్ 2 కూడా విజ‌యసాయిరెడ్డి అనేది తెలిసిందే.. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో ఉంటే, ఇటు పార్టీని గాడిలో పెట్ట‌డంలో విజ‌య‌సాయిరెడ్డి పాత్ర ఎంతో అమోఘం అనే చెప్పాలి. అయితే తెలుగుదేశానికి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించేలా రాజ‌కీయ వ్యూహాలు అమ‌లుప‌ర‌చ‌డంలో విజ‌య‌సాయిరెడ్డి దిట్ట‌.
 
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి - తెలుగుదేశానికి  మూడు రాజ్య‌స‌భ సీట్లు వ‌చ్చే నెల‌లో రానున్నాయి.. అయితే ఈ సీట్ల కోరం ఒక్కో ఎంపీకి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు వెయ్యాలి... ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా  67 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌లో  23 మందిని పార్టీ ఫిరాయించేలా చేసింది తెలుగుదేశం పార్టీ... ఇప్పుడు 44 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి సరిగ్గా ఉన్నారు.. 
 
ఇటీవ‌ల జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి  రాజ్య‌స‌భ అభ్య‌ర్ధి అని ప్ర‌క‌టించారు. అయితే 44 మందిలో ఒక‌రిని తెలుగుదేశంలోకి తీసుకువెళ్లినా వైసీపీకి వ‌చ్చే సీటు కూడా ద‌క్క‌దు.. ఇదే ప్లాన్ తెలుగుదేశం ఆలోచిస్తోంది.. తాజాగా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌కు క‌ళ్లు తిరిగే ఆఫ‌ర్ ఇచ్చింద‌ట సైకిల్ పార్టీ,  100 నుంచి 150 కోట్ల రూపాయ‌ల ఆఫర్ ప్ర‌క‌టించింది అని తెలుస్తోంది. దీంతో వైసీపీని నైతికంగా దెబ్బ‌తీయాలి అని సైకిల్ పార్టీ ఆలోచ‌న‌.
 
అయితే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా,  పార్టీ ఫిరాయింపులు జ‌రుగ‌కుండా చూస్తున్నారు... తెలుగుదేశం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అనే ఊబిలో ఇరుక్కోబోతోంది.. దీంతో పార్టీలో ఉన్నా నాయ‌కులే బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ముందుకు వెళ్లాలి అని చూస్తున్నారు.. అయితే విజ‌య‌సాయిరెడ్డితో పార్టీ ఫిరాయించిన నాయ‌కులు తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని ఆస‌క్తి చూపుతున్నారు అని కూడా తెలుస్తోంది.. అంతే కాదు న‌లుగురు  తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి రావాలి అని ఆలోచ‌న‌లో ఉన్నారట‌.. ఇది తెలుగుదేశానికి  ఇంట‌ర్న‌ల్ గా కంటి మీద కునుకులేకుండా చేస్తోన్న అంశం.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.