టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 14:58:14

టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో నాలుగేళ్లుగా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ, అలాగే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ... తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌కు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులన్ని జగన్ కు అనుకూలంగా మారుతున్నాయా... అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు... గ‌తంలో  రాయ‌ల‌సీమ జిల్లాల రాజ‌కీయం మొత్తం టీడీపీ వైపు చూసిన సంగ‌తి తెలిసిందే.. ఇక తాజాగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల‌లో  ప్ర‌యాణించిడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయి టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట‌. రాయ‌ల‌సీమలోనే కాకుండా కోస్తా టీడీపీ రాజ‌కీయాలు సైతం వైసీపీ వైపు చూస్తున్నాయ‌ని తాజా స‌మాచారం.
 
అయితే ఇదే విష‌యాన్ని సాక్షాత్తు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు... టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్షంగా కాకుండా ప‌రోక్షంగా ట‌చ్ లో ఉన్నార‌ని అదును చూసి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వీరంద‌రూ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్దం చేసుకున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.... అయితే ఈ విష‌యంపై జ‌గ‌న్ పూర్తి స్థాయి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న అన్నారు.
 
అందులో భాగంగానే  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని మ‌రోసారి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు విజ‌య‌సాయిరెడ్డి...గ‌తంలో ఎర్ర‌చంద‌నం అమ్మి మ‌హిళ‌ల‌కు డ్వాక్రా రుణ‌మాఫీ చేయిస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కూ అది పూర్తి  చేయ‌లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు...రుణ మాఫీ పేరు చెప్పి చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారని మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.