అమ్మ‌కానికి బెజ‌వాడ రైల్వే స్టేష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 10:59:08

అమ్మ‌కానికి బెజ‌వాడ రైల్వే స్టేష‌న్

విన‌డానికి కాస్త విడ్డూరంగా ఉన్నా......ఇది నిజ‌మేనండోయ్!!!  కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉండే రైల్వే డిపార్ట్ మెంట్ ను ట‌చ్ చేయ‌డం అంతా ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో రైల్వే శాఖ‌నే ప‌లు సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ద‌మైంది. 
 
గ‌తేడాదే ఈ దిశ‌గా రైల్వేశాఖ ఆలోచ‌న‌లు ప్రారంభించింది.  అయితే కార్య‌చ‌ర‌ణ మాత్రం ఇప్పుడు వేగ‌వంతం అయింది. రీ డెవ‌ల‌ప్ మెంట్ కోసం బెజ‌వాడ రైల్వే స్టేష‌న్ ను ప్రైవేటు కంపెనీల‌కు అప్ప‌గించేందుకు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. 
 
ఇందుకు సంబంధించి  టెండ‌ర్ ను కూడా విడుద‌ల చేసింది రైల్వేశాఖ‌. అయితే రైల్వే స్టేష‌న్ ను 45 యేళ్లు కాకుండా ఏకంగా 99 ఏళ్ల‌కు లీజుకి ఇస్తే టెండ‌ర్ల‌లో పాల్గొంటామ‌ని  ప్రైవేట్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రైల్వే శాఖ నిర్ణ‌యంపై కార్మిక సంఘాలు మండిప‌డుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.