టీడీపీలో భ‌గ్గుమ‌న్న విభేధాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 05:01:09

టీడీపీలో భ‌గ్గుమ‌న్న విభేధాలు

ఏపీ రాజ‌ధాని విజ‌యవాడ‌లో  అధికార పార్టీ మేయర్ కు - అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ల మ‌ధ్య వ‌ర్గ పోరు ఇంకా కొన‌సాగుతోంది. విజ‌య‌వాడ న‌గ‌ర‌ మేయర్‌ ప‌ద‌విని అడ్డం పెట్టుకుని  కార్పొరేట‌ర్ల‌తో ఇష్టానుసారంగా మేయ‌ర్ ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న పై కొంద‌రు కార్పొరేట‌న్లు ఫిర్యాదు చేస్తున్నారు... దీంతో మేయ‌ర్ ప‌ద‌వి నుంచి ఆయ‌న్ను త‌ప్పించాల‌ని కార్పోరేట‌ర్లు సిద్దం అయ్యారు...ఈ గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణి చేందుకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్పొరేట‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు.
 
సొంత‌ పార్టీ  కార్పొరేట‌ర్లును గౌర‌వించ‌లేని మేయ‌ర్‌ను ప‌ద‌వి నుంచి  త‌ప్పించాలంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కోరార‌ట కార్పొరేట‌ర్లు. అలాగే రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠంలో ఇత‌రుల‌ను నియ‌మించాల‌ని తెలియ‌జేశార‌ట‌. మేయ‌ర్‌ను తొల‌గించి, కొత్త వారిని నియ‌మించ‌డం అనే విష‌యాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతాన‌ని కార్పొరేట‌ర్లకు తెలియ చేశారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 
 
స‌మావేశం త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మేయ‌ర్ ప్ర‌వ‌ర్త‌న పై కార్పొరేట‌ర్లు ఫిర్యాదు చేశార‌ని. ఈ వివాదం కేవ‌లం స‌మ‌న్వ‌య‌లోపం వ‌ల్ల వ‌చ్చిందేన‌ని అన్నారు... మేయ‌ర్ శ్రీధ‌ర్‌తో భేటి అయి దీనిని సామ‌ర‌స్యంగా ప‌రిప్క‌రించుకోవాల‌ని సూచిస్తామ‌ని బుద్దా పేర్కొన్నారు... మేయ‌ర్ ప‌ద‌విని రొటేషన్ పద్ధతిలో ఇత‌ర కులాల వారిని నియ‌మించాల‌ని కార్పొరేట‌ర్లు కోరుతున్నారని, మేయ‌ర్ విష‌యాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయ‌న‌ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.