ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క పిలుపు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 02:51:58

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క పిలుపు...

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిత్యం ఆలోచించి సుప‌రిపాల‌న చేసిన ఎకైక మ‌ఖ్య‌మంత్రి వైయ‌స్సార్ మాత్రమే అని అన్నారు వైసీపీ నాయ‌కులు.. ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం నిర్విరామంగా ఆయ‌న త‌న‌యుడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్ర‌మిస్తున్నారు అని, ప్ర‌జాసేవ చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న నాయ‌కుడు జ‌గ‌న్ అని అన్నారు వైసీపీ నాయ‌కులు.. ఇప్ప‌టికే విభ‌జ‌న‌కు ముందు విభ‌జ‌న‌కు త‌ర్వాత రాష్ట్రంలో ఏడు సంవ‌త్స‌రాలుగా అధికార పార్టీల పై అన్యాయాల‌ను ప్ర‌శ్నిస్తూ త‌న గ‌ళం విప్పుతున్నారు అని అన్నారు  వైసీపీ నాయ‌కులు.
 
తిరుపతిలో జరుగుతున్న వైసీపీ రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాల్గొన్నారు... ఆయ‌న మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతీ  కార్య‌క‌ర్త శ్ర‌మించాలని శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.... ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా  ఎదుర్కోవ‌డానికి సిద్దంగా ఉండాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.
 
ప‌రిపాల‌న‌లో ఉన్న లోపాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని సూచించారు. అలాగే వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పోరాటాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసే బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌దే ఆని ఆయ‌న అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.  పార్టీ కోసం ప‌ని చేసే ప్ర‌తి వ్య‌క్తిని  గుర్తిస్తార‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామంద్రారెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి  పాల్లొన్నారు...
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.