సంచ‌ల‌నంగా మారిన విజ‌య‌సాయి రెడ్డి వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 02:26:32

సంచ‌ల‌నంగా మారిన విజ‌య‌సాయి రెడ్డి వార్నింగ్

రాజ్య‌స‌భ స‌భ్యుడు  విజ‌య‌సాయి రెడ్డి  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ లో కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పార్టీలో అధినేత వైయ‌స్ జ‌గ‌న్ త‌ర్వాత అన్నీ తానై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 
 
అయితే తాజాగా  ఓ స‌మావేశంలో విజ‌య‌సాయి రెడ్డి ప‌లువురికి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌త్యేక హోదా వంటి అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న వైసీపీని  ప్ర‌భుత్వ పెద్దల అండ‌తో  సంబంధిత అధికారులు అడ్డుకోవడం అంద‌రికీ తెలుసు. 
 
ఈ క్ర‌మంలో సీఎంఒ ఇన్ ఛార్జ్‌ స‌తీష్ చంద్ర‌, ఇంటిలిజెన్స్ చీఫ్ వెంక‌టేశ్వ‌ర్ రావు వంటి అధికారుల‌కు విజ‌య‌సాయి రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.  అధికారంలోకి వ‌చ్చాక అంతుచూస్తామంటూ కొంద‌రి పేర్ల‌ను ప్ర‌స్తావించారు విజ‌య‌సాయి రెడ్డి.
 
ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌ల‌పై కూడా ఆయ‌న తీవ్ర స్ధాయిలో విరుచుకుప‌డ్డారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కళా వెంకటరావు, ఎంపి టీజీ వెంకటేష్ ల‌ను  విజ‌య‌సాయి రెడ్డి  టార్గెట్ చేశారు.
 
వైకాపాకు చెందిన ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను కొనుగోలు చేయ‌డంతోనే ఆయ‌న టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ గా పెట్టుకున్నారు. భారీగా ముడుపులు ఇచ్చిన త‌మ పార్టీ వారిని ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.