టీడీపీ ఎమ్మెల్యే ముగ్గురిని హ‌త్య‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-11 13:24:48

టీడీపీ ఎమ్మెల్యే ముగ్గురిని హ‌త్య‌

అధికార తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే ఆంజ‌నేయులు విచ్చ‌ల‌విడిగా స్మ‌గ్లింగ్ చేసి అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ఆరోపించారు. ఈరోజు మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, అధికార బ‌లంతో టీడీపీ ఎమ్మెల్యే ఆంజ‌నేయులు హ‌త్యా రాజ‌కీయాలు శ‌వ‌రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
అంతేకాదు త‌న వ్యాపారంలో భాగ‌స్వామిని హ‌త్య చేయించి వారి ఆస్తుల‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్నార‌ని బ్ర‌హ్మ‌నాయుడు ఆరోపించారు. త‌మ ఆస్తుల‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్న ఆంజ‌నేయుల‌కు అడ్డు వ‌చ్చినందుకు భాగ‌స్వామి భార్య‌ను కూడా బెదిరించార‌ని ఆయన మండిప‌డ్డారు. 2014 నుంచి ఆంజ‌నేయులు అధికార బ‌లంతో వేలకోట్లు సంపాదించుకున్నార‌ని ఇంత సంపాద‌న ఎక్క‌డినుంచి వ‌చ్చిందో మీడియా ద్వారా వివ‌రించాల‌ని బ్ర‌హ్మ‌నాయుడు డిమాండ్ చేశారు.
 
ఆయ‌న అక్ర‌మ సంపాద‌నకు తాను అడ్డు త‌గులుతున్నందుకు త‌న‌పై హ‌త్య కేసులను పెట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ మేర‌కు పోలీసుల‌పై కూడా ఎమ్మెల్యే ఆంజనేయులు ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. పోలీసులు ప‌క్ష‌పాతం లేకుండా విచార‌ణ చేయిస్తే వాస్త&zwnj