వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న న్యూస్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 15:52:08

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న న్యూస్...

1. 2009 సెప్టెంబర్ 2 రాష్ట్ర ప్రజానీకాన్ని కన్నీటి సంద్రంలో ముంచి, రాజకీయ మేధావులను అంతా ఒకచోట చేర్చిన సందర్భంలో ఎత్తినచేయి దించనైనా లేదు ఓ ముప్ఫై ఏడు సంవత్సరాల యువకుడు.అతన్ని కన్నీటితో జాలిగా చూస్తున్న కన్నులకు కూడా అతను రెండు చేతులెత్తి మౌనంగానే ధైర్యాన్ని చెప్పినప్పుడు జగన్ లో ఓ నాయకుడు కనిపించాడు.
 
2.పావురాల గుట్టలో" నాన్న నాకో పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు"అని జగన్ అన్నప్పుడు రాష్ట్ర బాధ్యతలు అతని చేతిలో ఉంటే ప్రతి కుటుంబాన్ని పెద్ద కొడుకులా చూసుకోగలడు అనిపించింది.
 
3.నాన్నగారి కోసం ప్రాణాలు వదిలిన ప్రతిఒక్కరి కుటుంబాన్ని రానున్న రోజుల్లో నేను కలుస్తాను అంటూ ఓదార్పు యాత్ర మొదలు పెట్టినప్పుడు అమాయక ప్రజలను, పేదవారిని కన్న తండ్రిలా అక్కున చేర్చుకొంటున్న అతని పెద్దమనసు చూసినప్పుడు ఆయన పాలనలో పేద ప్రజలు సుఖసంతోషాలతో బ్రతగ్గలరు అనిపించింది.
 
4. ఓదార్పుయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అడ్డుతగిలి నీకు భవిష్యత్తు కావాలా?చెరసాల కావాలా? అని డెడ్ లైన్ విధిస్తే యుద్ధరంగంలోకి దిగినప్పుడు మరణం అయినా వీర మరణంగా స్వీకరిస్తాను అన్న సంకేతాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక విశ్వసనీయత గల నాయకుడు ఉదయించాడు అనిపించింది.
 
5.నీతో పాటూ మేమూ వస్తాము అన్న కొంతమంది నాయకుల దగ్గర ఇక నామీద కేసులు పెట్టవచ్చు, అనేక ఇబ్బందులు సృష్టించవచ్చు. నాతో నడవాలి అనుకుంటే మీ పదవికి,పార్టీకి రాజీనామా చేసిరండి. అని జగన్ అన్నప్పుడు. ఆయనలో ఒక విశ్వసనీయత గల నాయకుడు కనిపించాడు.
 
6.తెలంగాణ విషయానికి వస్తే పార్లమెంటులో తను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఆలోచించకుండా పొట్టి శ్రీరాములు లాంటి అమరవీరుల కృషి వ్యర్థం కాకుండా రాష్ట్రం కలిసే ఉండాలని సమైక్యాంధ్ర ప్లకార్డు చేతబట్టి .తెలంగాణాను బంగారు తెలంగాణా గా మారుస్తాను. రాష్ట్రం కలిసే ఉండాలని పోరాడినప్పుడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత ఆలోచిస్తున్నాడో,చరిత్రను నిలబెట్టాలని ఎంత తాపత్రయ పడుతున్నాడో తెలిసింది.
 
7.ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు విచారణ పేరుతో పిలిచి పదహారు నెలలు జైల్లో బంధించిన. అంతులేని ఆత్మవిశ్వాసంతో తిరిగొచ్చాడే తప్ప ఎక్కడ పిరికితనం దరిచేరనివ్వని జగన్ ని చూసి ఒక నాయకుడికి దమ్మూ, ధైర్యం ఎంత అవసరమో తెలిసింది.
 
8. 2014లో ఎన్నికలు జరుగుతుంటే ఏ ఒక్కడి మద్దతు కోరుకుండా, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ప్రజలముందుకు వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరమో తెలిసింది.
 
9.ప్రజలు అబద్ధాలను,అవకాశవాదాన్ని అందలం ఎక్కించి విశ్వసనీయతను ప్రతిపక్షంలో కూర్చోబెడితే తన వాగ్దాటితో ప్రశ్నిస్తుంటే నిజాయితీకి ఉన్న పవర్ ఏంటో తెలిసింది.అసెంబ్లీలో అబద్దాలు ఎదురు దాడికి దిగుతున్నాయి.నిజాలు శూలాలై గుచ్చుకొంటున్నాయి.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కూడా ఒక లెక్కల మాస్టర్ లా నోటి లెక్కలతోనే చెపుతున్న జగన్ ని చూసి అనుభవం కంటే పరిజ్ఞానం ఎంత అవసరమో తెలిసింది.
 
10...నంద్యాల బై ఎలక్షన్ లో ప్రజలు డబ్బుకు,ప్రలోభాలకు ఎంత బలి అవుతున్నారో తెలిసొచ్చిన ఆ దారిలో రాజకీయాలు చెయ్యకుండా విలువలతో రాజకీయాలు చేయాలన్న తన సిద్ధాంతానికి మరింత బలాన్ని ఇస్తూ ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజల ముందుకు వచ్చిన జగన్ ని చూసి ఆయన అభిమానిని అయినందుకు,ఆయన సిద్ధాంతాలకు మద్దతుగా నిలిచి ఆయన పోరాటంలో భాగం అయినందుకు గర్వపడుతున్నాను.ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకం అవుతుంది.
 
ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.