విజ‌య‌సాయి రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలోకి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 17:47:38

విజ‌య‌సాయి రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలోకి ?

ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే... అయితే ఈ క్ర‌మంలో వైసీపీ ఎంపీలు త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేశారు..
 
ఇక తాజాగా ప్ర‌త్యేక హోదా అమలు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా  ఈ నెల 30న విశాఖలో వంచన దినం కార్య‌క్ర‌మాన్ని వైసీపీ చేప‌ట్ట‌నుంది.. ఈ కార్య‌క్ర‌మం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు  అంటే 12 గంటల పాటు పార్టీ నేతలు నిరాహార దీక్ష చేప‌ట్ట‌నున్నారు.. ఈ దీక్ష‌లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొని నిరాహార దీక్ష చేయ‌నున్నారు.
 
ఇక తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంచ‌న దినం కార్య‌క్ర‌మం ఎక్క‌డ ఏర్పాటు చేయాలి, అనే దానిపై ఈ రోజు విశాఖప‌ట్నంలో వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు...ఈ స‌మావేశం త‌ర్వాత అందరి సూచనల మేరకు ఏకాభిప్రాయంతో పాత జైల్‌రోడ్డు జంక్షన్‌ వద్ద ఉన్న మహిళా కళాశాల ఎదురుగా ఉన్న స్థలం అనువైనదిగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.
 
ఇక వంచ‌న దినం రోజు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నామ‌ని విజ‌య సాయిరెడ్డి తెలిపారు.. కేంద్రంతో టీడీపీ నాయ‌కులు మిత్ర ప‌క్షం వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎలా త‌ప్పుదోవ ప‌ట్టించారో , వాటిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న తెలిపారు..
 
ఈ కార్యక్రమానికి  పార్టీ ఎంపీలు, రాజ్యసభ్యులతో పాటు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జరుగుతున్న జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనాయకులంతా హాజరవుతారని విజ‌య‌సాయి రెడ్డి పిలుపునిచ్చారు.
 
ఇక దీంతో పాటు విజ‌య‌న‌గ‌రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌లు గుత్తిరాల వెంకటేశ్వరరావు, కొండపల్లి సునీల్, కోకర్ల మస్తాన్‌ చౌదిరి,మయనేన మోషన్‌సాయి,పెలిశేటి రమేష్,పర్వతనేని సత్యనారాయణ,కడియాల రామకృష్ణ వీరంద‌రూ  ఎంపీ... విజ‌య‌సాయి రెడ్డి  స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు...
 
ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే త‌మ జిల్లా బాగుప‌డుతుంద‌ని భావించి టీడీపీకి ఓట్లు వేశామ‌ని, కానీ నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా ఇంత వ‌ర‌కూ త‌మ జిల్లాలో ఒక్క చోట‌కూడా అభివృద్ది జ‌రుగ‌లేద‌ని వారు అన్నారు...అయితే తాము అభివృద్ది కోస‌మే వైసీపీలోకి చేరామ‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.