బాబు ఫోటోలు మొక్కులు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:50:40

బాబు ఫోటోలు మొక్కులు....

కొత్త‌గా ఉద్యోగంలో చేరిన స‌మ‌యంలో మన టేబుల్ ద‌గ్గ‌ర కూర్చునే స‌మ‌యంలో ఆ కుర్చీకి టేబుల్ కి దెణ్నం పెట్టుకుంటాం... పెద్ద‌ల‌కు న‌మ‌స్కారం చేస్తాం.... కొత్త క‌ర్త‌వ్యాలు చేప‌ట్టిన స‌మయంలో ఈ ఫీట్లు అన్నీ చేస్తాం... అయితే నేడు సీఎం చంద్ర‌బాబు హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌లో అద్బుత‌మైన ప్ర‌తిభ క‌న‌ప‌రిచారు... సౌత్ ఇండియాలో రాజ‌కీయ నాయ‌కులు ఇంత ప‌ద్ద‌తిగా ఉంటారా అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు.. పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు  ప్రధాన ద్వారం మెట్లు వద్ద ఫొటోగ్రాఫర్ల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు పోజులిచ్చారు అనే వార్త  వైర‌ల్ అవుతోంది.
 
ఇక యోగా తరహాలో ముందుకు వంగి.. మెట్లను చేతులతో తాకిన చంద్రబాబు.. అది కెమెరాలో రాలేదని కెమెరామేన్‌ చెప్పడంతో.. మరోసారి పార్లమెంటు మెట్లను తాకుతూ కెమెరాల వైపు చూసి ఫోజు ఇచ్చారట‌.. ఇక పార్ల‌మెంట్ మెట్ల‌ను తాక‌డంతో ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు... నాడు ప్ర‌ధాని మోదీ కూడా ఇలానే తాకారు అని, ఇప్పుడు అదే ఫీటు చంద్ర‌బాబు చేశారు అని అంటున్నారు.
 
బీజేపీ నేత,ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఈ విష‌యం పై మాట్లాడారు...... పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానమంత్రికి మొక్కినట్టే అన్నారు ఆయ‌న‌...ఒక్క మాట‌తో తెలుగుదేశం సైకిల్ కు పంక్చ‌ర్ వేశారు ఆయ‌న‌... ఇక  రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని.. శాండ్, ల్యాండ్ గురించి మాట్లాడతామని అన్నారు.. మొత్తానికి ఈ రోజు సీఎం చంద్ర‌బాబు హ‌స్తిన ప్ర‌యాణం అంతా ఫోటో షూట్ల‌తో బాగుంది అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు. మ‌రి రేపు ఏం కర్త‌వ్య‌మో చూడాలి ఏపీకి ఇలా అయితే క‌చ్చితంగా ప్ర‌త్యేక హూదా వ‌స్తుంది అంటున్నారు ప్ర‌జ‌లు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.