15 న వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 14:54:07

15 న వైసీపీలోకి

ప్రతిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌లపెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ  కంచుకోట కృష్ణా జిల్లా నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది...ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌ల‌తో పాటు టీడీపీ కీల‌క నేత‌లు కూడా వైఎస్ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ.... ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న చూసి ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు... ఎక్క‌డ చూసినా అవినీతి అక్ర‌మాలు చేస్తునే ఉన్నార‌ని అన్నారు... బీజేపీ ప్ర‌భుత్వం దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వ‌నన్ని నిధుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేటాయించింద‌ని, కానీ వాటిని అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు విఫ‌లం అయ్యార‌ని విష్ణు కుమార్ రాజు మండిప‌డ్డారు.
 
అయితే ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిపాల‌న‌ను చూసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నార‌ని అన్నారు.... ఇందుకోసం వచ్చే నెల 15న డేట్ ఫిక్స్ చేసుకున్నార‌ని అన్నారు... అలాగే తాను వ్య‌క్తిగ‌తంగా విశాఖ‌ప‌ట్నంలో వైఎస్ జ‌గ‌న్ క‌లుసుకుంటాన‌ని తెలిపారు... 
 
దీంతో పాటు చంద్ర‌బాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు... ముఖ్య‌మంత్రి త‌న రాజ‌కీయ ల‌బ్దికోసం స‌మ‌ర దీక్ష‌పేరు చెప్పి దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని విష్ణు కుమార్ రాజు మండిడ్డారు.. ఒక‌ప్పుడు చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజికి ఒప్పుకున్నార‌ని గుర్తు చేశారు.... 
 
అయితే మొత్తానికి విష్ణు కుమార్ రాజు చెప్పిన మాట‌లు చుస్తుంటే వ‌చ్చే నెల‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు రావ‌డం ఖాయం అనిపిస్తోంది.. దీంతోపాటు ప‌లువురు టీడీపీ ఎమ్మెల్యేలు కుడా వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు  తెలుస్తోంది... మొత్తానికి వ‌చ్చే నెల‌ 15 నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌ల జోరు  విప‌రీతంగా జ‌ర‌గుతుందని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.