వైసీపీపై విష్ణు కుమార్ రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vishnu kumar raju
Updated:  2018-06-19 06:39:55

వైసీపీపై విష్ణు కుమార్ రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నీతిఅయోగ్ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీని మ‌ర్వాదపూర్వ‌కంగా క‌లిస్తే త‌ప్పేంట‌ని బీజేపీ శాస‌న స‌భాప‌క్ష‌నేత‌ విష్ణుకుమార్ రాజు ధ్వ‌జ‌మెత్తారు. ఈ విష‌యాన్ని ప‌ట్టుకుని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అలాగే తాము రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత‌లుగా ఉన్నాము కాబ‌ట్టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని క‌లిస్తే త‌ప్పులేద‌ని రాజు విమ‌ర్శించారు.
 
ఏ రాజ‌కీయ నాయ‌కుడు అయినా రాష్ట్రంలో ప‌రిపాల‌న స‌రిగ్గా లేక‌పోతే విమ‌ర్శ‌లు చేస్తాము త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేయమ‌ని అన్నారు. వ్య‌క్తి గ‌త విష‌యాల‌పై రాజ‌కీయ‌నాయ‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఇక ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష‌నేత‌లు ఆస‌రాగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వారికి ఈ ప‌ని త‌ప్ప వేరే ప‌ని లేద‌ని విష్ణుకుమార్ రాజు ధ్వ‌జ‌మెత్తారు.
 
చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన మంత్రి మోడీతో స‌మావేశం అయిన‌ప్పుడు వారు న‌వ్వుతూ మాట్లాడుకోవ‌టాన్ని కూడా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌డం ఏంట‌ని అన్నారు. అయితే ఈ భేటిలో ఏ మాత్రం పాయింట్ అవుట్ చేసే అవ‌కాశంలేద‌ని విష్ణు కుమార్ రాజు స్ప‌ష్టం చేశారు.   

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.