విష్ణుకుమార్‌ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:14:16

విష్ణుకుమార్‌ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్ర‌మానికి బీజేపీ నాయ‌కులు అంద‌రూ హాజ‌ర‌య్యారు...బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు..నాలుగేళ్లు త‌మ‌తో క‌లిసి ప‌నిచేసిన తెలుగుదేశం ఇప్పుడు కావాల‌నే మాపై విమ‌ర్శ‌లు చేస్తోంది అని ఆయ‌న అన్నారు.అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు... రాష్ట్రంలో బీజేపీ నేత‌ల‌పై ఒక్క అవినీతి మ‌ర‌క లేద‌ని ఆయ‌న అన్నారు. 
 
ఇక మంత్రి గంటా శ్రీనివాస‌రావు పై ఆయ‌న మండిప‌డ్డారు, అంతేకాదు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు..విశాఖపట్టణాన్ని దోచేసిన ఘనత మంత్రి గంటా శ్రీనివాస రావుకే దక్కుతుంద‌ని విమ‌ర్శ‌లు చేశారు.. భీమిలి నియోజకవర్గంలో అడుగడుగునా భూ కబ్జాలేనని, వాటిపై సిట్‌ విచారణ వేయించే ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు మంత్రి గంటా శ్రీనివాస‌రావు య‌త్నించార‌ని ఆరోపించారు... ఇక అసెంబ్లీలో కూడా ఈ అవినీతిపై బీజేపీ మాట్లాడితే స‌ర్కారు మా గొంతు నొక్కుతోంది అని ఆయ‌న విమ‌ర్శించారు. 
 
ఎప్పుడు అసెంబ్లీలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను మాట్లాడినా ప్ర‌స్తావించినా వెంట‌నే మైక్ క‌ట్ చేస్తార‌ని,ఏపీలో ప్ర‌తిప‌క్షం అంటే తెలుగుదేశానికి భ‌యం ప‌ట్టుకుంది,  జ‌గ‌న్ అంటే టీడీపీ భయ‌ప‌డుతోంద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు....ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం ప్రజల్లోకి వెళ్లడంతో చంద్రబాబుకి భయం మొదలైందని చెప్పారు. అందుకే ప్యాకేజ్‌కి ఒప్పుకుని యూటర్న్‌ తీసున్నారని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.