బ్రేకింగ్... వైసీపీలోకి విష్ణుకుమార్ రాజు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and vishnu kumar raju
Updated:  2018-07-25 10:33:36

బ్రేకింగ్... వైసీపీలోకి విష్ణుకుమార్ రాజు

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్నాయి అంటే రాజకీయ నాయ‌కుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. అంతేకాదు ఆయా నియోజ‌కవ‌ర్గాల‌కు చెందిన కీల‌క నాయ‌కులు కూడా తమ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు. అలా జంప్ చేసిన చాలామంది ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న‌వారే ఎక్కువ‌. అధికార తెలుగుదేశంపార్టీలో ఉండి కూడా ముంద‌స్తు రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యారు.
 
ఇక ఇదే క్ర‌మంలో విశాఖ నార్త్  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఫ్యాన్ కింద కూర్చొని గాలిని ఆస్వాదించాల‌ను కుంటున్నారు. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప స్టీల్ ప్లాంట్ వంటి కీల‌క హామీల‌ను బీజేపీ అధిష్టానం తుంగ‌లో తొక్క‌డంతో ఏపీలో క‌మ‌లం ప‌రిస్థితి రానురాను అడుగు అంటిపోతుంది. దీంతో విష్ణు కుమార్ రాజు త‌న ఇంట్లో దీపం ఆర‌క‌ ముందే త‌న ఇల్లు స‌రిపెట్టుకోవాల‌నే నేప‌థ్యంలో ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని వైసీపీ తీర్ధం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే దీనికి త‌గ్గ‌ట్టుగానే విష్ణుకుమార్ రాజు వైసీపీ క్యాంప్ స‌మావేశ చ‌ర్చ‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా విశాఖ నార్త్ సీటును ద‌క్కించుకున్న విష్ణు కుమార్ రాజు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ త‌ర‌పున ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ్యాల‌ని భావిస్తున్నారు. అయితే ఇందుకు వైసీపీ అధిష్టానం కూడా సానుకులంగా ఉంద‌ని తెలుస్తోంది. 
 
ఇక వ‌చ్చే నెల‌లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో భాగంగా విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించబోతున్నారు. ఆయన విశాఖ‌లో పాద‌యాత్ర పూర్తి చేసుకున్న త‌ర్వాత విష్టుకుమార్ రాజు, జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.