అత‌ను ఓ హంత‌కుడు........

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-06 12:13:44

అత‌ను ఓ హంత‌కుడు........

తెలుగుదేశం స‌ర్కార్ బీజేపీకి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చే శ‌క్తి  ఇకలేన‌ట్టు క‌నిపిస్తోంది.. ఇటు ఉన్నా ఒకే ఒక్క వ్య‌క్తి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోవ‌డంతో తెలుగుదేశం బీజేపీ మ‌ధ్య వార్ వ‌న్ సైడ్ నుంచి టూసైడ్ స్టార్ట్ అయింది అనే చెప్పాలి.
ఇక పోల‌వ‌రం నిధులు లెక్క‌ల నుంచి మొద‌లైన ఈ వార్ ఇప్పుడు తెలుగుదేశం పెట్టిన ఫ్లెక్స్ ల వ‌ర‌కూ వెళ్లింది అనే చెప్పాలి.
 
ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ విష‌యం పై మండిప‌డిన విష‌యం తెలిసిందే.. అలాగే బీజేపీ ఎమ్మెల్యే శాస‌న‌స‌భ ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా స్పందించారు.. కేంద్రంలో మిత్రపక్షంగా కొనసాగుతూనే ఏపీలో మాత్రం మోడీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టడం,  పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని టీడీపీ నేతలకు సూచించారు.
 
తెలుగుదేశం నాయ‌కులు కామెంట్లు చేసే ముందు ఆలోచించి మాట్లాడాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.. తాము తెలుగుదేశం నాయ‌కుల పై నోరు విప్పితే ప‌రిస్దితి వేరుగా ఉంటుంది అని అన్నారు....టీడీపీలో హత్యలు చేసే గుండాలకు, రౌడీలకే పదవులు ఇస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.
 
ప్రధాని మోదీని కించ‌ప‌రిచేలా మాట్లాడిని తెలుగుదేశం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ నిర‌స‌న తెల‌ప‌డం పై విష్ణుకుమార్ తీవ్రంగా స్పందించారు..హత్య కేసులో నేరస్తుడిగా ఉన్న వ్యక్తి .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన చేయడం ఏమిటని ప్రశ్నించారు..ఐదు లక్షలు ఇస్తే హత్య చేసే వారికి టీడీపీలో పదవులు ఇచ్చారన్నారు ఆయ‌న‌... ఇక ప‌దిలక్ష‌లు ఇస్తే త‌న‌ను కూడా చంపేస్తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు..వాసుపల్లి గణేష్‌ పై చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రధానిని కించపరిచినందుకు కేసు నమోదు చేయాలన్నారు.  అసెంబ్లీకి తాము చాలా బాధగా వస్తున్నామన్నారు. టీడీపీ రెచ్చగొడితే తాము నోరు విప్పాల్సి వస్తుందని అప్పుడు టీడీపీ బండారం మొత్తం బయటపడుతుందన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.