సీఎం రమేష్‌ దీక్ష గిన్నిస్ రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 18:37:15

సీఎం రమేష్‌ దీక్ష గిన్నిస్ రికార్డ్

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ నాయుడు క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా  నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దీక్షను సీఎం ర‌మేష్ సుమారు 11 రోజుల పాటు చేసి రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించారు. ఇక తాజాగా ఈ దీక్షపై భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు విష్ణు కుమార్ రాజు మీడియా ద్వారా స్పందించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, క‌డ‌ప ఉక్కు సాధ‌న కోసం టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ దీక్ష‌ను గిన్నిస్ బుక్ లో ఎక్కించాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏ రోగం లేని సాధార‌ణ వ్య‌క్తే ఐదు రోజులు నిరాహార దీక్ష చేయాలంటేనే చాలా క‌ష్టం అలాంటిది షుగ‌ర్, బీపీ ఉన్న సీఎం ర‌మేష్ 11 రోజులు నిరాహార దీక్ష‌చేయ‌డం అంటే గిన్నిస్ రికార్డే అని వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో నాలుగు సంవ‌త్స‌రాలు పొత్తు పెట్టుకున్న‌ప్పుడు ఒక్క రోజు కూడా ఉక్కుప‌రిశ్ర‌మ గురించి కేంద్రంతో చ‌ర్చించ‌లేద‌ని విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. 
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రానికి చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు దీక్ష‌లు పేరు చెప్పి దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సీఎం ర‌మేష్ దీక్ష చేయ‌డం వ‌ల్ల నిరాహార దీక్ష‌ల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని వ్యాఖ్యానించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.