విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bjp mla vishnu kumar raju image
Updated:  2018-03-06 07:17:36

విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు

బీజేపీ తెలుగుదేశం ఫైట్ మ‌రింత పెరిగింది అనే చెప్పాలి... హూదా ఉద్య‌మం చివ‌ర‌కు పార్టీల్లో విమ‌ర్శ‌ల నుంచి ఏకంగా ప్లెక్సీల వ‌ర‌కూ వెళ్లింది... ఇటు బీజేపీ త‌ర‌పున రాష్ట్రంలో ఉన్న క‌మ‌లం పార్టీ నాయ‌కుల‌కు తెలుగుదేశంతో మిత్ర‌ప‌క్షంగా ఉండటం ఇష్టం లేదు అని, తెలుగుదేశం పదే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తోంది.. అలాగే బీజేపీ తాము మిత్ర‌ప‌క్షంగా ఉంటూ మీకు స‌పోర్ట్ చేస్తున్నాం అని మీకు స‌పోర్ట్ చేయ‌క‌పోతే మీ అవినీతి జ‌మా ఖ‌ర్చులు బ‌య‌ట‌పెట్ట‌డం మాకు ప‌ది నిమిషాల పని అని అంటున్నారు నాయ‌కులు.
 
తాజాగా నేడు  బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత విష్ణుకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలో గుండాల‌కు రౌడీల‌కు..  మాత్ర‌మే ప‌ద‌వులు ఇస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. ఇక హ‌త్య‌లు చేసేవారిని తెలుగుదేశంలో ప్రొత్స‌హిస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.... రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని పార్టీలో వెన‌కేసుకు వ‌స్తున్నారు అని అన్నారు. 
 
అలాగే రూ.10 లక్షలను ఇస్తే నన్ను కూడా చంపేస్తారు అని ఆయ‌న ఫైర్ అయ్యారు... టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ హుందాగా నిరసన చేస్తే బాగుండేది. మోదీ మెడలు వంచినట్లు ఆయన నిరసన తెలిపారు. రౌడీలను అద్దెకు తెచ్చి టీడీపీ ధర్నాలు చేయిస్తోంది.... ఇది ఎంత‌వ‌ర‌కూ  స‌మంజ‌సం మిత్ర‌ప‌క్షంగా మీరు ధ‌ర్మాన్నినిర్వ‌ర్తిస్తున్నారా అని ఆయ‌న ఫైర్ అయ్యారు.
 
ఇక హ‌త్య‌కేసులో నేర‌స్తుడుగా ఉన్న వ్య‌క్తికి ఎలా ప‌ద‌వులు ఇస్తారు.. ఇలాంటి వ్య‌క్తి న‌రేంద్ర‌మోదీని తిడ‌తాడా ఆయ‌న‌కు వ్యతిరేకంగా నిరసన చేయడమా?.అటువంటి వారికి నగర ఉపాధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించం. గవర్నర్‌ ప్రసంగానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టి ప్రధానిపై నీచంగా నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. మోదీపై నిరసన చేపట్టిన వారిని అరెస్ట్‌ చేయాలి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు నమోదు చేయాలి.
 
ఇటువంటి వ్యక్తులు ఉన్న టీడీపీ చాలా దారుణంగా ఉంది. మేము నోరు విప్పతే టీడీపీ బండారం బయటపడుతుంది. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. మేము నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి ఉంటుంది అని ఆయ‌న ధ్వజమెత్తారు... మొత్తానికి తెలుగుదేశం నాయ‌కుల‌కు బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వార్ ఇప్పుడు స‌మిసేలా లేదు.. ఇటు పార్ల‌మెంట్ స‌మావేశాలు అటు అసెంబ్లీ స‌మావేశాలు అయ్యేవ‌ర‌కూ కూడా పొత్తు ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు..ఇటు వైసీపీ దూకుడు కూడా తెలుగుదేశానికి కాస్త కాక‌పుట్టిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.