సంచ‌ల‌నం తానురేపు ఏ పార్టీలో ఉంటానో తెలియ‌దు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vishnu kumar raju
Updated:  2018-09-12 12:33:43

సంచ‌ల‌నం తానురేపు ఏ పార్టీలో ఉంటానో తెలియ‌దు

తాను ఏ విష‌యాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతాన‌ని, రేపు ఏ పార్టీలో ఉంటానో తెలియ‌దు... అందువ‌ల్ల ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడుతాన‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ శాస‌న‌స‌భ‌ప‌క్ష‌నేత విష్ణుకుమార్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 నుంచి బీజేపీ అధికారంలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల‌ను అసెంబ్లీ స‌మావేశంలో ఆయ‌న ప్ర‌స్తావిస్తున్న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు క‌ల్పించుకుని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.
 
బీజేపీ నాయ‌కులు వాస్త‌వాల‌ను మాట్లాడాల‌ని రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారో మాట్లాడ‌ల‌ని అన్నారు. దీంతో విష్ణు కుమార్ రాజు క‌ల్పించుకుని టీడీపీ నాయ‌కులుకు త‌మదైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. తాను రేపు ఏ పార్టీలో ఉంటానో తెలియ‌దు అని ఏ పార్టీలో ఉన్నా నిజాల‌ను మాట్లాడటం త‌న నైజం అని విష్ణుకుమార్ రాజు వెల్ల‌డించారు.
 
కొద్దికాలంగా  అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు గుజ‌రాత్ లోని ప‌టేల్ విగ్ర‌హానికి సుమారు 2, 500 కోట్ల‌ నిధుల‌ను కేటాయించ‌ద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేద‌ని ఆయ‌న అన్నారు. నిజానికి ఈ విగ్ర‌హానికి కేంద్రం కేటాయించింది కేవ‌లం 300 కోట్లు మాత్ర‌మే అని విష్ణు కుమార్ రాజు స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల‌ని ఉంద‌న్న ఆయ‌న అందుకోసం తానుకూడా టీడీపీ నాయ‌కుల‌తో పాటు పోరాడుతాన‌ని పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.