విష్ణుకుమార్ రాజు వెర్షన్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vishnu kumar raju image
Updated:  2018-03-14 04:33:50

విష్ణుకుమార్ రాజు వెర్షన్..?

కేంద్రం ఇచ్చిన షాక్ ల‌తో ఇంకా కోలుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ... ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌లు కూడా దీనిపై అంత ఆలోచ‌న చేయ‌డం లేదు, ముందు ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి అన్నారు, త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలి అన్నారు, ప్యాకేజీ బ్ర‌హ్మండం అన్నారు, చివ‌రకు వీరికి ఏం ఇచ్చినా త‌ల ఊపుతున్నారు అని కేంద్రం కూడా సైలెంట్ అయింది.. ఏపీకి ప్రత్యేక హూదా ఇచ్చేది లేదు అని తేల్చేసింది.
 
అయితే మిత్ర‌ప‌క్షంగా ఏపీలో కొన‌సాగుతున్న ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేశారు.. తెలుగుదేశానికి ఎప్ప‌టి నుంచో ఓ విష‌యంలో కాస్త ఆలోచ‌న‌ ఉంది... అది  విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ పై.. ఆయ‌న మిత్ర ప‌క్షంగా ఉన్నా తెలుగుదేశానికి స‌పోర్ట్ చేయ‌రు, ప‌క్కా బీజేపీ వాది... ఇటు వైసీపీ ని అంత ఘాటుగా విమ‌ర్శించ‌రు,  ముందు నుంచి తెలుగుదేశానికి  ఆయ‌న పై న‌మ్మ‌కం లేదు, చివ‌ర‌కు ఆయ‌న అసెంబ్లీలో కూడా మాకు జ‌గ‌న్ కు ఎటువంటి స‌త్సంబంధాలు లోప‌కారి ఒప్పందాలు లేవు అని  చెప్పినా న‌మ్మే ప‌రిస్దితి క‌నిపించ‌డం లేదు పార్టీలో.. అయితే గ‌తంలో  విశాఖ భూ కుంభ‌కోణం నుంచి ప‌లు సంద‌ర్బాల‌లో  తెలుగుదేశం పై అనేక కామెంట్లు చేస్తూనే ఉన్నారు విమ‌ర్శ‌ల జోరు పెంచుతున్నారు.
 
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో తమకు రహస్య ఒప్పందాలేవీ లేవని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు చెప్పినా తెలుగుదేశం.....జగన్‌తో పబ్లిక్‌గా గాని, రహస్యంగా గానీ మేమెలాంటి సంప్రదింపులు జరపలేదు. అలాంటివి ఉంటే తప్పకుండా చెబుతాం. ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండానే ప్రస్తుత పరిస్థితుల్లో హోదా వస్తుందో రాదో చెప్పలేను. రైల్వే జోన్‌ రాదని ఎవరు చెప్పారు? మా పార్టీ తరపు నుంచి ఎవరూ చెప్పలేదు. రైల్వే అధికారుల కమిటీ పరిశీలించి,సాంకేతికంగా సాధ్యం కాదని నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవలసి ఉంది. తెలుగుదేశం కాస్త ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు పైనా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పైన ఫోక‌స్ చేసింది అని, ఇటు బీజేపీ నాయ‌కులు కూడా చర్చించుకుంటున్నారు. ఇటు బీజేపీని ఎట్టి ప‌రిస్ధితుల్లో టీడీపీ వ‌ద‌ల‌దు అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.