పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన విష్ణుకుమార్ రాజు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 02:21:48

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన విష్ణుకుమార్ రాజు

గ‌త కొంత కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ శాస‌న‌స‌భాక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్ల‌డుతున్న తీరుపై అనేక వార్త‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని క‌ల‌వాల‌ని చెప్ప‌డంతో పాటు... అసెంబ్లీలోని పీఏసీ ఛాంబ‌ర్ లోని వైసీపీ ఆఫీస్ లో మాట్ల‌డిన తీరును చూస్తే ఆయ‌న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళ‌నున్నారనే అనుమానాలు రాక మాన‌వు.

దీంతో నిజంగానే విష్ణుకుమార్ రాజు వైసీపీలో వెళ్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌నపై వ‌స్తున్న వార్త‌ల‌కు స్పందించారు. ఫిరాయింపు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌డం త‌ప్ప‌నేది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని విష్ణుకుమార్ రాజు అన్నారు.

పీఏసీలోని వైసీపీ ఆఫిస్ లో కూర్చున్నంత మాత్రాన పార్టీ మారిన‌ట్లు కాద‌ని, తాను వైసీపీలోకి వెల్ల‌నున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.రాజకీయాలకు అతీతంగా మాట్లాడానని, ప్రతిదానిని రాజకీయకోణంలో చూడొద్దని విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.