ఆ పార్టీ పై విష్ణుకుమార్ రాజు వెర్షన్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 05:03:47

ఆ పార్టీ పై విష్ణుకుమార్ రాజు వెర్షన్..?

మొత్తానికి  వైసీపీ అధినేత జ‌గ‌న్  చేసిన వ్యాఖ్య‌ల పై ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా కౌంట‌ర్లకు సిద్దం అవుతోంది.. కేంద్రం పై అవిశ్వాసం ఎవ‌రూ పెట్ట‌ర‌ని, ఇదంతా ఒట్టి ప్ర‌చారం అని ఆయ‌న కొట్టిపారేశారు... అయితే ఇటు జ‌గ‌న్ కూడా త‌మ‌కు మ‌ద్ద‌తు ఎవ‌రు ఇస్తే వారిని ముందుకు తీసుకువెళ‌తాం అని, త‌మ‌తో క‌లిసి వ‌చ్చే వారితో కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని అన్నారు.
 
అయితే ఇటు తెలుగుదేశం మాత్రం తాము క‌లిసి వ‌స్తాము అని చెప్ప‌డం లేదు, ఏపీకి ఎటువంటి నిధులు ఇవ్వ‌క‌పోయినా, తాము క‌లిసి ఉండేందుకు రెడీ అవుతోంది బీజేపీతో తెలుగుదేశం.. అయితే ఇటు బీజేపీ నాయ‌కుల‌కు ఏపీ తెలుగుదేశం నాయ‌కులు కౌంట‌ర్లు ఇవ్వ‌డం పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు.
 
బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ తెలుగుదేశం మ‌ద్ద‌తుతో గెలిచారు,  కాదు అని ఎవ‌రూ అన‌డం లేదు అని ఆయ‌న అన్నారు.. టీడీపీ ఎమ్మెల్యే అనిత  చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న త‌న స్పంద‌న పార్టీ త‌ర‌పున తెలిపారు... మాధ‌వ్ ఆ స‌మ‌యంలో ఇరు పార్టీల త‌ర‌పున మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్దిగా పోటీ చేశారు అని అన్నారు.
 
తాము ఏపీపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోమ‌ని, కేంద్రం ఎలా అంటే అలా ఫాలో అవుతాము అన్నారాయ‌న‌.. కేంద్రం క‌టీఫ్ చెబితే తాము బ‌య‌ట‌కు వ‌స్తామ‌ని, ఇక ఇటీవ‌ల పార్టీ స‌మావేశంలో కొంద‌రు బీజేపీ మంత్రుల‌ను రాజీనామా చేసి తెలుగుదేశం కాంపౌండ్ నుంచి బ‌య‌ట‌కు రావాలి అని కోరార‌ని, ఆయ‌న తెలియ‌చేశారు. ఏపీలో పొత్తుల విష‌యంలో అమిత్ షా నిర్ణ‌యం ఫైనల్ అన్నారు విష్ణుకుమార్ రాజు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.