వైసీపీలోకి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 06:09:52

వైసీపీలోకి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర త‌న సొంత జిల్లా క‌డ‌ప నుంచి మొద‌లు పెట్టి నేడు నిర్విరామంగా నెల్లురు జిల్లాలో కొన‌సాగుతోంది.... జ‌గ‌న్ త‌లపెట్టిన ఈ సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో హాజ‌రవుతున్నారు.... అయితే రాయ‌లసీమ జిల్లాల‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున  అత్య‌ధిక మెజారిటీతో గెలుపొంది అధికార పార్టీ అండ‌తో టీడీపీ పార్టీలోకి  ఫిరాయించిన వారు, అన‌వ‌స‌రంగా పార్టీ మారాన‌ని త‌ల బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు.
 
క‌డ‌ప జిల్లాలో త‌ల‌పెట్టి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు రాయ‌లసీమ‌లోనే కాకుండా నెల్లూరు  జిల్లాలో కూడా అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపేందుకు చిత్ర ప‌రిశ్ర‌మకు నేత‌లు కూడా రెడీ అవుతున్నారు. 
 
ఇటీవ‌లే మాస్ డైరెక్ట‌ర్ వీ.వీ వినాయ‌క్ కూడా సినిమాల‌కు పుల్ స్టాప్ పెట్టి  రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయాల‌నుకున్నాడ‌ట‌... అయితే ఈ నేప‌థ్యంలో వినాయ‌క్  త‌రచుగా సేవా కార్య క్ర‌మాలు చేస్తూ, అక్క‌డ స్థానికంగా ఉన్న‌టువంటి ప్ర‌జ‌ల‌కు బాగా ద‌గ్గ‌ర‌వుతున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.
 
అయితే ఆయ‌న తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఇంటిలిజెంట్... ఈ సినిమాకు సంబంధించి బహిరంగ వేడుకల‌ను  రాజమండ్రిలో జ‌ర‌ప‌డానికి  కూడా అదే కారణమని కొంత మంది అనుకుంటున్నారు. తన బలం చూపించడానికే రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని వినాయక్‌ ఏర్పాటు చేశాడ‌ని అనుకుంటున్నారు. ఇక చాగ‌ల్లు కు చెందిన వివి వినాయ‌క్ జిల్లాలో ఏదో ఓ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు అని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.