వైసీపీ స‌రికొత్త కార్య‌క్ర‌మం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 06:18:12

వైసీపీ స‌రికొత్త కార్య‌క్ర‌మం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ జిల్లాల్లో పూర్తిచేసుకుని నెల్లూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది.. ఆయ‌న‌కు నెల్లూరు జిల్లాలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.. పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో 69 వ రోజుకు చేరుకుంది.
 
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట‌ నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైసీపీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు.  జ‌గ‌న్ నెల్లూరు జిల్లాకు చేరిన వెంట‌నే ఆయ‌నపై పూల వ‌ర్షం కురిపించారు.. జ‌గ‌న్ వెంట నెల్లూరు జిల్లా నాయ‌కులు ముందుకు న‌డుస్తున్నారు.
 
ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర ప‌లు మైళ్లు రాళ్ల‌ను దాటుతూ ముందుకు క‌దులుతోంది.. నెల్లూరు జిల్లాలోనే వైఎస్‌ జగన్‌ పాదయాద్ర  ఈనెల 28వ తేదీన 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించనుంది. ఈ సమ‌యంలో వైసీపీ  కీల‌క కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది...వాక్‌ విత్‌ జగనన్న !! జగనన్నతో నడుద్దాం!! అనే కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది.
 
ఇక జ‌గ‌న్ దేశ విదేశాల్లో తెలుగు ప్ర‌జ‌లు  700కు పైగా ప్రదేశాల్లో ఏక కాలంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ ఆరోజున పాదయాత్రను చేపట్టనున్నారు. ఇది వైసీపీ పిలుపుగా వైసీపీ శ్రేణుల‌కు పిలుపునిస్తున్నారు.. దీనిపై వైసీపీ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.. ఇక కోస్తా జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర ఏ విధ‌మైన ప్ర‌భావం చూపుతుందో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.