నువ్వో నేనో తేల్చుకుందాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nallari kiran kumar reddy and nallari kishore kumar reddy
Updated:  2018-08-21 03:23:27

నువ్వో నేనో తేల్చుకుందాం

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా త‌రుణంలో చిత్తూరుజిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పస‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌కే టికెట్ ఇస్తార‌ని అన్నారు. అయితే ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీలేరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తే మీరు త‌ప్పుకుంటారా అని కిశోర్ ను మీడియా అడుగ‌గా అందుకు కిశోర్  ఘాటుగా స్పందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీలేరు నుంచి త‌న‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు పోటీ చేసినా కూడా తాను పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఇక ఆయ‌న వ్యాఖ్య‌లు విన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి అనుచ‌రులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. గతంలో  కిర‌ణ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చిత్తూరు జిల్లాలో చ‌క్రం తిప్పిన కిశోర్ కుమార్ రెడ్డి, ఇప్పుడు అన్నకు వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం విడ్డురంగా ఉంద‌ని అంటున్నారు. అన్న‌కు త‌మ్ముడు ఇచ్చే మ‌ర్యాదా ఇదేనా అంటూ కిర‌